
లొంగిపోయిన మావోయిస్ట్
విశాఖపట్నం : కోరుకొండ ఏరియా కమిటీలో డిప్యూటీ కమాండర్‌గా పనిచేసిన మావోయిస్ట్ నేత మల్లేష్ (40) శుక్రవారం విశాఖ రేంజ్ డీఐజీ ఎ.రవిచంద్ర ఎదుట లొంగిపోయారు. మల్లేష్ 41 కేసులలో నిందితుడుగా ఉన్నాడు. మల్లేష్ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం రూ. 4 లక్షల రివార్డు ప్రకటించింది. కాగా మల్లేష్ ఆరోగ్య సమస్యలతోనే లొంగిపోయినట్లు తెలుస్తోంది.