ఓ రాజా లొంగుబాటు | O Raja surrender at chennai court | Sakshi
Sakshi News home page

ఓ రాజా లొంగుబాటు

Published Thu, Jun 25 2015 8:35 AM | Last Updated on Sun, Sep 3 2017 4:21 AM

ఓ రాజా లొంగుబాటు

ఓ రాజా లొంగుబాటు

చెన్నై : మాజీ ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రజా పనుల శాఖ మంత్రి ఓ పన్నీరు సెల్వం సోదరుడు ఓ రాజ కోర్టు లో లొంగి పోయారు. పూజారి ఆత్మహత్య కేసు విచారణానంతరం ఆయనకు బెయిల్ మంజూరైంది.
 
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జైలు శిక్ష నేపథ్యంలో  రాష్ట్రం ఓ పన్నీరు సెల్వం సీఎం పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో పన్నీరు సోదరుడు రాజ ఆగడాలకు హద్దేలేదన్న ఆ రోపణలు బయలు దేరాయి. అలాగే పెరియకుళం సమీపంలోని ఓ గ్రామం లో పూజారిగా ఉన్న నాగముత్తు ఆత్మహత్య చేసుకోవడం వివాదానికి దారి తీసింది. పన్నీరు బ్రదర్ రాజ అండ్ బృందం ఒత్తిళ్లు తాళలేక నాగముత్తు ఆత్మహత్య చేసుకున్నట్టుగా విచారణలో తేలింది.
 
వ్యవహారం మదురై హైకోర్టుకు వెళ్లి అక్కడి నుంచి తేని జిల్లా మెజిస్ట్రేట్ కోర్టుకు చేరింది. విచారణ బృందం రాజ, అక్కడి అన్నాడీఎంకే నాయకులు పాండి, మన్‌మారన్, శివకుమార్, జ్ఞాన లోగు, శరవణన్ తదితర ఏడు మందిపై కోర్టులో చార్జ్ షీట్ దాఖలైంది. విచారణకు రావాలంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లకు నోటీసులు జారీ అయినా, ఖాతరు చేయలేదు. ఇక వారెంట్ల జారీ కాబోతుందన్న సమాచారంతో అన్నాడీఎంకే నేత పాండి మేల్కొన్నారు. రెండు రోజుల క్రితం కోర్టులో లొంగిపోయి, అనంతరం బెయిల్ తీసుకుని బయటకు వచ్చేశారు.
 
 రాజా లొంగుబాటు : పాండికి బెయిల్ లభించడంతో తనకూ వస్తుందన్న ఆశతో కోర్టులో లొంగి పోయేందుకు ఓ రాజ నిర్ణయించారు. అయితే, నాగముత్తు కేసులో ప్రధాని నిందితుడిగా ఆయన పేరు చేర్చి ఉండడంతో బెయిల్ లభించేనా అన్న ఉత్కంఠ నెలకొంది. దీంతో చడీ చప్పుడు కాకుండా కోర్టులో లొంగి పోయేందుకు ఏర్పాటు చేసుకున్నారు. ఈ వ్యవహారం మీడియా కంటపడకుండా అన్నాడీఎంకే వర్గాలు జాగ్రత్తలు పడ్డారు. బుధవారం రాజ కోర్టులో లొంగిపోయే సమయంలో పెరియకుళంలో పార్టీ నేతృత్వంలో భారీ కార్యక్రమానికి ఏర్పాటు చేశారు.
 
 దీంతో మీడియ వర్గాలంతా పెరియకుళంకు చేరుకున్నాయి. ఇదే అదనుగా భావిం చిన రాజ కోర్టు వెనుక ద్వారం గుండా లోనికి వెళ్లారు. న్యాయమూర్తి శివజ్ఞానం ఎదుట హాజరై ఈ కేసులో తాను లొంగి పోతున్నట్టు పేర్కొన్నారు. దీంతో ఆయన్ను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. నాగముత్తు ఆత్మహత్య వ్యవహారం విచారణ కాసేపు సాగినానంతరం తనకు బెయిల్ మం జూరు చేయాలని కోర్టుకు రాజ విన్నవించారు. బెయిల్ మంజూరులో జాప్యం నెలకొనడంతో ఉత్కంఠ నెల కొంది. ఎట్టకేలకు మధ్యాహ్నం భోజన విరామానంతరం రాజకు బెయిల్ లభించడంతో పన్నీరు సెల్వం మద్దతు శిబిరంలో ఆనందం వికసించింది.   

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement