నాగ్పూర్: మహారాష్ట్రలో 502మంది మావోయిస్టులు లొంగిపోయారు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మావోయిస్టుల లొంగుబాటు కార్యక్రమం సానూకూల ఫలితాలను ఇస్తున్నట్లయింది. ఇప్పటి వరకు పదేళ్లలో 502మంది మావోయిస్టులు తమ ఆయుధాలను వదిలి పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వీరిలో 482మంది నిత్యం మావోయిస్టుల అలజడి ఉండే గడ్చిరోలి ప్రాంతం నుంచే ఒంటరిగా పోలీసులకు సరెండర్ అయినట్లు వెల్లడించింది.
మహారాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 29, 2005న నక్సల్ సరెండర్ పాలసీని ప్రారంభించింది. ఈ పాలసీని ప్రారంభించిన తర్వాత లొంగిపోయిన తొలి మావోయిస్టు మదన్ అన్నా అలియాస్ బాలన్ బల్యా. కాగా ఇప్పటి వరకు లొంగిపోయిన మావోయిస్టులకు వివిధ పరిశ్రమల్లో నైపుణ్య శిక్షణలు ఇప్పించడం ద్వారా, స్వయం ఉపాధి కల్పించడం ద్వారా పునరావాసం కల్పించారు.
502మంది మావోయిస్టులు లొంగిపోయారు
Published Tue, Oct 6 2015 11:52 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
Advertisement