రేపిస్టును చంపేసి...లొంగిపోయింది | jharkhand woman kills rapist, turns self over to police | Sakshi
Sakshi News home page

రేపిస్టును చంపేసి... లొంగిపోయింది

Dec 12 2015 6:54 PM | Updated on Jul 29 2019 5:43 PM

రేపిస్టును చంపేసి...లొంగిపోయింది - Sakshi

రేపిస్టును చంపేసి...లొంగిపోయింది

తనపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని హత్యచేసి అనంతరం పోలీసులకు లొంగిపోయిందో మహిళ. రాజస్తాన్ రాంచిలోని గత బుధవారం చోటుచేసుకున్న ఘటన కలకలం రేపింది.

రాంచి: తనపై అఘాయిత్యానికి పాల్పడిన దుండగుడిని హత్యచేసి అనంతరం పోలీసులకు లొంగిపోయిందో మహిళ. జార్ఖండ్ లోని రాంచిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
 
బాధితురాలు ఇళ్లల్లో పనిచేసుకుంటూ స్థానిక హౌసింగ్ సొసైటీలో నివసిస్తోంది. బుధవారం తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడిన మనోజ్ కుమార్(24) ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ క్రమంలో తన చేతికందిన సుత్తితో అతడి తలపై బలంగా కొట్టింది. ఆవేశంతో రగిలిపోయి అతడి మొహాన్ని ఛిద్రం చేసింది. దీంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు.

ఆ మరునాడు ఉదయం, డెడ్ బాడీని ఇంట్లోపెట్టి తాళం వేసి యధావిధిగా పనికి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఏమనుకుందో ఏమో తెలియదుగానీ, అదేరోజు అర్థరాత్రి స్థానిక పోలీసు స్టేషన్ లో లొంగి పోయింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆమెను పోలీస్ కస్టడీకి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement