లొంగిపోయిన 20 మంది ఉగ్రవాదులు
Published Sun, Jul 3 2016 7:25 PM | Last Updated on Mon, Sep 4 2017 4:03 AM
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ లో ఉగ్రవాదులు లొంగిపోయారు. బదక్షన్ ప్రావిన్స్ ప్రాంతంలో 20 మంది ఉగ్రవాదులు లొంగిపోయినట్టు ఆదివారం పోలీసు అధికారులు తెలిపారు. మౌలావి ఇక్రముద్దీన్ నాయకత్వంలోని వీరు తమ ఆయుధాలతో ఫజియాబాద్ లో పోలీసుల ఎదుట లొంగిపోయారని ఆ దేశ మీడియా వెల్లడించింది. రఘిస్థాన్ జిల్లాలో పోలీసులతో జరిగిన భీకర పోరు అనంతరం వీరు పోలీసులకు లొంగిపోయారు.
Advertisement
Advertisement