Badakhshan
-
ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ వరదలు.. 16 మంది మృతి
ఆఫ్ఘనిస్తాన్లోని బగ్లాన్, బదక్షన్ రాష్ట్రాలను భారీ వరదలు ముంచెత్తాయి. తాజాగా సంభవించిన ఈ వరదల కారణంగా 16 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 500 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ రాష్ట్రాల్లోని దండ్ ఎ ఘోరీ, దోషి, పుల్ ఎ ఖుమ్రీ, సెంట్రల్ బదక్షన్‌లోని మోర్చక్ తదితర ప్రాంతాలు వరదలకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.గత వారంలో ఆఫ్ఘనిస్తాన్లోని పలు ప్రాంతాల్లో సంభవించిన వరదల్లో 300 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదల కారణంగా వందలాది ఇళ్లు, వేల ఎకరాల్లోని వ్యవసాయ భూములు ధ్వంసమయ్యాయి. ఈ నేపధ్యంలో ఐక్యరాజ్య సమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం(యూఎన్డబ్ల్యుఎఫ్పీ) ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది.యూఎన్డబ్ల్యుఎఫ్పీ ట్విట్టర్లో ఒక ఫోటోను షేర్ చేస్తూ, తమ సంస్థ ఉద్యోగులు బగ్లాన్కు అత్యవసర సామగ్రిని పంపిణీ చేస్తున్నారని పేర్కొంది. బగ్లాన్ పోలీస్ కమాండ్ అధిపతి అబ్దుల్ గఫూర్ ఖాడెం మాట్లాడుతూ బగ్లాన్ రాష్ట్రంలోని దోషి జిల్లాలోని లర్ఖబ్ ప్రాంతంలో వర్షాల కారణంగా అత్యధిక నష్టం నమోదైందని చెప్పారు. లర్ఖబ్‌లో ముగ్గురు చిన్నారులు, ఒక మహిళ, ఇద్దరు పురుషులు మరణించారు. 500లకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ వరదల్లో ఒక కుటుంబానికి చెందిన పది మంది సభ్యులు, మరో వ్యక్తి గాయపడ్డారని బదక్షన్ ప్రకృతి విపత్తు నిర్వహణ అధిపతి మహ్మద్ కమ్గర్ తెలిపారు. -
అఫ్గాన్ ఈశాన్య ప్రాంతమంతా తాలిబన్ల అధీనంలోకి
కాబూల్: అఫ్గాన్ భూభాగాలను తాలిబన్ సేనలు మెరుపువేగంతో తన అధీనంలోకి తెచ్చుకుంటున్నాయి. ప్రావిన్స్‌లపై పట్టుకోసం అఫ్గాన్ సైన్యం, తాలిబన్ మూకల మధ్య పోరుతో దేశంలో యుద్ధమేఘాలు మరింతగా కమ్ముకున్నాయి. తాజాగా మరో మూడు ప్రావిన్స్‌ల రాజధానులను తాలిబన్ దళాలు ఆక్రమించాయి. తాజాగా బదఖ్షాన్ రాజధాని ఫైజాబాద్, బాగ్లాన్ రాజధాని పోలి–ఖుమ్రీ, ఫరాహ్ ప్రావిన్స్ రాజధాని తాలిబన్ వశమయ్యాయి. దీంతో అఫ్గాన్ ఈశాన్య ప్రాంతమంతా తాలిబన్ల అధీనంలోకి వచ్చింది. కుందుజ్ ఎయిర్‌పోర్ట్‌లోని సైనిక స్థావరాన్ని తాలిబన్లు ఆక్రమించారు. దీంతో తాలిబన్లపై ప్రతిదాడులు చేసి వారు తోకముడిచేలా చేసేందుకు అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ రంగంలోకి దిగారు. బాల్ఖ్ ప్రావిన్స్‌లోని స్థానికసైన్యాల నేతలైన అబ్దుల్ రషీద్ దోస్తుమ్ తదితరులను సాయం కోరేందుకు అక్కడికి చేరుకున్నారు. వారం వ్యవధిలోనే ఆరు ప్రావిన్స్‌ల రాజధానులు తాలిబన్ చేతచిక్కాయి. మరోవైపు, కీలక దేశ ‘కస్టమ్స్ ఆదాయ మార్గాలను’ తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో దిక్కుతోచని స్థితిలో ఆర్థికమంత్రి ఖలీద్ పయేందా పదవికి రాజీనామా చేసి, దేశం వదిలి పారిపోయారని ఆర్థికశాఖ అధికార ప్రతినిధి మొహమ్మద్ రఫీ తబే చెప్పారు. ఉపసంహరణ ఆగదు: బైడెన్ అఫ్గాన్ సైన్యానికి తోడుగా ఉండేందుకు ఆ దేశంలోనే అమెరికా సేనలు ఉండబోతున్నాయని, సేనల ఉపసంహరణకు బ్రేక్ పడుతుందన్న వార్తలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొట్టిపారేశారు. ‘మా బలగాలు అమెరికాకు రావడం ఖాయం. ఇప్పటికే అఫ్గాన్‌లో 20ఏళ్లకాలంలో దాదాపు రూ.74లక్షల కోట్లు ఖర్చుపెట్టాం. 3లక్షల మంది అఫ్గాన్ సైనికులకు శిక్షణ ఇచ్చాం. ఇకపై అఫ్గాన్ సేనలు తమ కోసం, తమ దేశం కోసం పోరాడాల్సిందే’అని బైడెన్ వ్యాఖ్యానించారు. కాగా, దేశ సైన్యంలో మరింతగా పోరాటస్ఫూర్తిని పెంచేందుకు ఆర్మీ చీఫ్ స్టాఫ్‌గా జనరల్ హిబాతుల్లా అలీజాయ్ను రక్షణశాఖ నియమించినట్లు స్థానిక మీడియా ప్రకటించింది. Heart breaking scenes from #Kunduz province #Afghanistan 😰 pic.twitter.com/QjRzNa6XwQ — Khalid Amiri - خالد امیري (@KhalidAmiri01) August 8, 2021 -
లొంగిపోయిన 20 మంది ఉగ్రవాదులు
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ లో ఉగ్రవాదులు లొంగిపోయారు. బదక్షన్ ప్రావిన్స్ ప్రాంతంలో 20 మంది ఉగ్రవాదులు లొంగిపోయినట్టు ఆదివారం పోలీసు అధికారులు తెలిపారు. మౌలావి ఇక్రముద్దీన్ నాయకత్వంలోని వీరు తమ ఆయుధాలతో ఫజియాబాద్ లో పోలీసుల ఎదుట లొంగిపోయారని ఆ దేశ మీడియా వెల్లడించింది. రఘిస్థాన్ జిల్లాలో పోలీసులతో జరిగిన భీకర పోరు అనంతరం వీరు పోలీసులకు లొంగిపోయారు. -
ఆఫ్ఘనిస్తాన్ లో మళ్లీ భూకంపం
కాబూల్ : ఆప్ఘనిస్తాన్‌లో బుధవారం ఉదయం భూమి కంపించండం కలకలం సృష్టించింది. రాజధాని కాబుల్ సహా ఆప్ఘాన్ లోని జుర్మ్, బదాక్షన్ తదితర పలు ప్రాంతాల్లో స్పల్ప భూకంపం సంభవించింది. దీని తీవ్ర రిక్టర్ స్టేల్ పై 5.6 గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో బెంబేలెత్తిన జనం ఇళ్లలోంచి బయటికి పరుగులు తీశారు. 5 సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఆస్తి, ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా అందలేదు. మరోవైపు ఇటీవల దేశంలోని వివిధ ప్రాంతాల్లో వరుసగా సంభవిస్తున్న భూ ప్రకంపనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. గతం వారంరోజుల్లో ఇది మూడవ భూకంపం సంభవించడం ఇది మూడో సారి. కాగా గత ఏడాది చివర్లో జరిగిన భూకంపం వల్ల ఆప్ఘాన్ అతలాకుతలమైన విషయం తెలిసిందే.