కృష్ణా జిల్లాలో పెద్ద అవుటపల్లి కాల్పుల ఘటనకు సంబంధించిన ఆరుగురు నిందితులు గన్నవరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు. లొంగిపోయిన నిందితులను స్థానిక కోర్టులో హాజరు పరిచారు. ప్రధాన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల పెద అవుటపల్లి జాతీయ రహదారిపై జరిగిన కాల్పుల ఘటనలో గంధం నాగేశ్వరరావు, అతని కుమారులు పగిడి మారయ్య, మారయ్యల హత్యకు గురైన సంగతి తెలిసిందే.