వరంగల్, న్యూస్‌లైన్ : ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాల యంలో తొలిసారిగా ఓ సీఈ స్థాయి అధికారిపై వేటు పడింది. పని తీరు సరిగా లేదనే కారణంగా ఆయనను సరెండర్ చేస్తూ సీఎండీ కార్తికేయ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు డీఈ స్థాయి వరకే పరిమితమైన చర్యలు... ఇప్పుడు చీఫ్ ఇంజి నీర్ల వరకూ చేరుకోవడం ఆ సంస్థలో కల కలం రేపుతోంది. విద్యుత్ భవన్‌లో ప్రాజెక్టు విభాగం సీఈగా సురేందర్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన గతంలో ఫర్చేసింగ్ విభాగంలో సీఈగా పని చేశారు. ఇటీవల జరిగిన ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో సీఎండీ ప్రశ్నలకు సీఈ సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. పలు నివేదికలు ఇవ్వడంలో జాప్యం సైతం జాప్యం చేసినట్లు సమాచారం. దీంతో ఆయనపై సీఎండీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా.. విధులను నిర్లక్ష్యం చేస్తున్నారని, పనితీరు సరిగా లేదనే కారణంగా సీఎండీ పేషీకి సరెండర్ చేస్తూ సీఎండీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇప్పటికే పలు ఆరోపణలు, విధుల నిర్లక్ష్యంపై కింది స్థాయి ఉద్యోగులపై వేటు పడుతున్న విషయం విదితమే. కానీ... డిస్కంలో ఎన్నడూ లేని విధంగా సీఈని సరెండర్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. అరుుతే మరో కొద్ది నెలల్లో ఉద్యోగ విరమణ పొందనున్న సురేందర్... సరెండర్ కావడంపై మనస్తాపానికి గురైనట్లు తెలిసింది. మరో ఎనిమిది నెలల సర్వీసు ఉండగా... దీర్ఘకాలిక సెలవులో వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా... సీఈ స్థాయి అధికారులపై ఇలా సరెండర్ చర్యలు తీసుకోవడం సరికాదనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి.
ప్రాజెక్ట్ విభాగం సీఈ సరెండర్
Published Fri, Aug 23 2013 4:14 AM | Last Updated on Fri, Sep 1 2017 10:01 PM
Advertisement
Advertisement