పెదవాల్తేరు (విశాఖపట్నం) : ఇద్దరు మావోయిస్టు దళ సభ్యులతోపాటు వారికి సహకరిస్తున్న మరో తొమ్మిదిమంది మిలీషియా సభ్యులు సోమవారం విశాఖ పోలీసుల ఎదుట లొంగిపోయారు. విశాఖ రూరల్ ఎస్పీ కోయ ప్రవీణ్ లొంగిపోయిన వారికి తక్షణ సాయం కింద రూ.10 వేలు చొప్పున అందించారు.
వారి ఉపాధికి ప్రభుత్వ పరంగా సాయం అందిస్తామన్నారు. లొంగిపోయిన మావోయిస్టు దళ సభ్యులు పి.చిన్నారావు, జి.మల్లేశ్వరరావు ఓ హత్య కేసులో నిందితులుగా ఉన్నట్టు ఎస్పీ వెల్లడించారు.