న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ తరపున మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న డొనాల్డ్ ట్రంప్‌కు ఊహించిన షాకే తగిలింది. ఆయనపై నేరారోపణలను దాదాపుగా ధృవీకరిస్తూ గురువారం ఆ దిశగా సంకేతాలు ఇచ్చింది న్యూయార్క్ కోర్టు. తద్వారా అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఇలా నేరారోపణలు ఎదుర్కొన్న మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ పేరు చరిత్రకెక్కింది.
2016 ఎన్నికల ప్రచారం సమయంలో.. ఓ పో*స్టార్‌కు డబ్బులు ఇచ్చి ఆమెతో శారీరక సంబంధాన్ని బయటకు రాకుండా అనైతిక ఒప్పందం(నాన్‌డిజ్‌క్లోజర్ అగ్రిమెంట్) చేసుకున్నాడనే ఆరోపణలు ట్రంప్‌పై ఉన్నాయి. ఈ తరుణంలో.. సదరు ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ రెండేళ్ల తర్వాత ఆ పో*స్టార్ కోర్టును ఆశ్రయించింది. అటుపై ఆయన అధ్యక్ష పదవిలో ఉండడంతో హైప్రొఫైల్ కేసుగా దర్యాప్తు సంస్థలు విచారణ జరిపాయి.
చివరికి.. ఈ నెల మధ్యలో ఈ వ్యవహారాన్ని ఖండిస్తూనే తన అరెస్ట్‌కు రంగం సిద్ధమవుతోందని, ఆందోళనలకు సిద్ధం కావాలంటూ అనుచరులు సోషల్ మీడియా ద్వారా పిలుపు ఇచ్చాడు ట్రంప్. ఈ తరుణంలో న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ గురువారం నాడు డొనాల్డ్ ట్రంప్ పై నేరారోపణలు చేసింది. అయితే.. ఈ వ్యవహారంలో ఆయన్ని అరెస్ట్ చేస్తారా? ఆయనే లొంగిపోతారా? కేవలం కోర్టు విచారణతో సరిపెడతారా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ఈ పరిణామంపై ఆయన అధ్యక్ష పోటీపైనా ప్రభావం చూపెట్టొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
అధ్యక్ష పదవిలో రెండుసార్లు అభిశంసన తీర్మానం ఎదుర్కొని నెగ్గారు. యూఎస్ కాపిటల్ మీద దాడి ఘటన, అధ్యక్ష భవనం వైట్‌హౌజ్‌లో ఉన్నప్పుడు కీలకమైన పత్రాల మిస్సింగ్(వాటిని నాశనం చేశారనే ఆరోపణలు ఉన్నాయి).. తదితర అభియోగాలు ఎదుర్కొంటున్నారు 76 ఏళ్ల ట్రంప్. ఒకవేళ సె* స్కాండల్ కుంభకోణంలో గనుక ట్రంప్ కోర్టు విచారణ గనుక ఎదుర్కొన్న, లేదంటే అరెస్ట్ అయినా.. ఆయన జీవిత పుస్తకంలో అదొక మాయని మచ్చగా మిగిలిపోవడం ఖాయం.
ఇదీ చదవండి: పండుగళ వేళ విషాదం.. ప్రాణాలు తీసిన పిండి
Comments
Please login to add a commentAdd a comment