యూఎస్‌లో 'ప్రాణం' గెలుస్తోంది! | Anti-abortion movement is winning: US vice president | Sakshi
Sakshi News home page

యూఎస్‌లో 'ప్రాణం' గెలుస్తోంది!

Jan 28 2017 11:24 AM | Updated on Apr 4 2019 3:25 PM

యూఎస్‌లో 'ప్రాణం' గెలుస్తోంది! - Sakshi

యూఎస్‌లో 'ప్రాణం' గెలుస్తోంది!

'మార్చ్‌ ఫర్‌ లైఫ్‌' కార్యక్రమంలో వైస్‌ ప్రెసిడెంట్‌ మైక్‌ పాల్గొన్నారు.

వాషింగ్టన్‌: అమెరికాలో అబార్షన్‌లకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఉద్యమం విజయవంతంమౌతోందని, దీనికి రిపబ్లికన్‌ ప్రభుత్వం తోడ్పడుతుందని వైస్‌ ప్రెసిడెంట్‌ మైక్‌ పెన్స్‌ అన్నారు. శుక్రవారం నిర్వహించిన 'మార్చ్‌ ఫర్‌ లైఫ్‌' కార్యక్రమంలో మైక్‌ పాల్గొన్నారు. అబార్షన్‌లకు వ్యతిరేకంగా వాషింగ్టన్‌లో ప్రతి సంవత్సరం నిర్వహించే మార్చ్‌ ఫర్‌ లైఫ్‌లో పాల్గొన్న తొలి యూఎస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మైక్‌ కావడం విశేషం.

'రైట్‌ టు లైఫ్‌'ను సపోర్ట్‌ చేసే వ్యక్తి ఇప్పుడు యూఎస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారని.. మార్ఛ్‌ ఫర్‌ లైఫ్‌లో పాల్గొనాలని స్వయంగా ట్రంప్‌ తనను కోరారని ఈ సందర్భంగా మైక్‌ చెప్పుకొచ్చారు. అబార్షన్‌లకు వ్యతిరేకంగా ఇటీవల రిపబ్లికన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఆయన ర్యాలీలో వివరించారు. అమెరికాలో ప్రాణం విజయం సాధిస్తోందన్న పెన్స్‌.. సంస్కృతిని పునరుద్ధరించేవరకు మనకు విశ్రాంతి లేదన్నారు. ర్యాలీ అనంతరం ప్రో లైఫ్‌ మార్చ్‌కు తన పూర్తి మద్దతు ఉంటుందని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement