జాబ్‌ క్యాలెండర్‌ బోగస్‌.. బీఆర్‌ఎస్‌ నిరసన | BRS MLAs Protest Against Congress Govt Job Calendar, More Details Inside | Sakshi
Sakshi News home page

జాబ్‌ క్యాలెండర్‌ బోగస్‌.. బీఆర్‌ఎస్‌ నిరసన

Published Fri, Aug 2 2024 6:30 PM | Last Updated on Fri, Aug 2 2024 7:37 PM

Brs Protest Against Congress Govt Job Calendar

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌పై గన్‌పార్క్‌ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. జాబ్‌ క్యాలెండర్‌ బోగస్‌ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. నిరుద్యోగులను మభ్యపెట్టలేరని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. జాబ్‌ క్యాలెండర్‌ బోగస్‌.. ఉద్యోగాలు లేవు. తెలంగాణ యువత కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతుందని హెచ్చరించారు.

నిరుద్యోగులను రెచ్చగొట్టి కాంగ్రెస్ గెలిచిందంటూ కేటీఆర్‌ ధ్వజమ్తెతారు. జాబ్ క్యాలెండర్‌పై అసెంబ్లీలో చర్చించాలని విజ్ఞప్తి చేసినా కానీ కనీసం రెండు నిమిషాలు కూడా మైకు ఇవ్వలేదని దుయ్యబట్టారు. యువతను కాంగ్రెస్ మోసం చేస్తోందన్న కేటీఆర్‌. రాహుల్‌గాంధీ, రేవంత్‌ అశోక్‌నగర్‌కు వస్తే యువత తరిమేస్తుందంటూ కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement