gunpark hyderabad
-
జాబ్ క్యాలెండర్ బోగస్.. బీఆర్ఎస్ నిరసన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. జాబ్ క్యాలెండర్ బోగస్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. నిరుద్యోగులను మభ్యపెట్టలేరని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ బోగస్.. ఉద్యోగాలు లేవు. తెలంగాణ యువత కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతుందని హెచ్చరించారు.నిరుద్యోగులను రెచ్చగొట్టి కాంగ్రెస్ గెలిచిందంటూ కేటీఆర్ ధ్వజమ్తెతారు. జాబ్ క్యాలెండర్‌పై అసెంబ్లీలో చర్చించాలని విజ్ఞప్తి చేసినా కానీ కనీసం రెండు నిమిషాలు కూడా మైకు ఇవ్వలేదని దుయ్యబట్టారు. యువతను కాంగ్రెస్ మోసం చేస్తోందన్న కేటీఆర్. రాహుల్‌గాంధీ, రేవంత్ అశోక్‌నగర్‌కు వస్తే యువత తరిమేస్తుందంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత.. రాజీనామా లేఖతో హరీశ్
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీపై తెలంగాణ రాజకీయం వేడెక్కింది. మాజీ మంత్రి హరీష్‌రావు, సీఎం రేవంత్ మధ్య సవాళ్లు.. ప్రతి సవాళ్ల మాటల యుద్ధం సాగుతోంది. రాజీనామా పత్రం జేబులో పెట్టుకొని సిద్ధంగా ఉండాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు రాజీనామా లేఖతో గన్‌పార్క్‌కు చేరుకున్నారు. దీంతో గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. హరీష్‌రావు సవాల్‌తో పోలీసులు భారీగా మోహరించారు. గన్‌పార్క్ వద్ద అనుమతి లేదని పోలీసులు అంటున్నారు.దమ్ముంటే సీఎం రేవంత్ తన సవాల్ స్వీకరించాలి..గన్ పార్క్ అమరుల స్తూపం వద్ద నివాళులర్పించిన హరీష్ రావు.. మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలన్నారు. ఆయనకు రావడానికి మొహమాటంగా ఉంటే పీఏతోనైనా స్టాఫ్తోనైనా రాజీనామా లేఖను పంపించాలన్నారు. జర్నలిస్టుల సాక్షిగా.. మేధావుల చేతిలో రాజీనామా లేఖను పెడుతున్నానన్నారు.‘‘ఆగస్టు 15th లోగా ఏకకాలంలో రుణమాఫీ చేయాలి. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరుతో ఇప్పటికే మోసం చేసింది. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి కాంగ్రెస్ మాట తప్పింది. సోనియమ్మ మాట అంటూ రేవంత్ రెడ్డి ప్రజలను ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం చేశారు. రైతుల కోసం నా రాజీనామా నా ఒక్క ఎమ్మెల్యే పదవి గొప్ప కాదు. రైతుల కోసం నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రేవంత్ రెడ్డి తను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. సోనియా గాంధీ పేరుతో తెలంగాణ ప్రజలను రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టించారు’’ అని రేవంత్ ధ్వజమెత్తారు.గన్ పార్కు వద్దకు చేరుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హరీశ్‌రావుకు మద్దతు పలికారు. ఈ సందర్బంగా తలసాని మాట్లాడుతూ, రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పిందంటూ మండిపడ్డారు. డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ మాట తప్పింది. ఇప్పుడు ఆగస్టు 15 అంటూ మరోసారి ఎన్నికల స్టంట్ వేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే హరీష్ రావు సవాల్‌ను స్వీకరించి ఇక్కడికి రావాలి. ఇవాళ కాకున్నా రేపైనా హరీష్ రావు సవాల్‌ను సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించాలని తలసాని డిమాండ్ చేశారు. -
‘బడ్జెట్ సమావేశాలు 6 రోజులేనా?’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారీ బడ్జెట్‌పై చర్చించి ఆమోదం పొందేందుకు గాను అసెంబ్లీ సమావేశాలను కేవలం 6 రోజులే నిర్వహించడం పట్ల కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) అసంతృప్తి వ్యక్తం చేసింది. కేవలం మొక్కుబడిగా చర్చించేందుకు అసెంబ్లీ సమావే శాలను అలంకార ప్రాయంగా నిర్వహించారని సీఎల్పీ నేత భట్టి ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలసి గన్‌పార్క్ మీడియా పాయింట్ వద్ద భట్టి మాట్లాడారు. కేవలం 6 రోజులపాటు చర్చ జరిపి రూ. 2.30 లక్షల కోట్ల బడ్జెట్‌ను ఆమోదించుకొని వెళ్లిపోయిన ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బడ్జెట్‌పై చర్చకు కనీసం 30 రోజులు అవసరమని, ప్రభుత్వ తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. 2023 నాటికి రూ.6 లక్షల కోట్ల అప్పులు.. రీ డిజైన్ చేసిన ప్రాజెక్టుల డీపీఆర్‌లను సభలో ప్రవేశపెట్టకుండా ప్రభుత్వం పారిపోయిందని, ఈ విషయంలో అవకతవకలు జరిగినట్టు తమకు అనుమానం కలుగుతోందని భట్టి పేర్కొన్నారు. ఏటా రూ. 50 వేల కోట్ల వరకు అప్పులు తీసుకొని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెడుతోందని, 2023కల్లా అప్పులు రూ. 5.5 లక్షల నుంచి రూ.6 లక్షల కోట్లకు చేరుకుంటాయన్నారు. -
నా పాత్రను పోషించనివ్వడం లేదు
సాక్షి, హైదరాబాద్: ‘నేను శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన దగ్గరి నుంచి తమ సభ్యులను టీఆర్ఎస్లో విలీనం చేసుకునే ప్రక్రియ మొదలు సభలో కాంగ్రెస్ పక్ష నాయకునిగా నా పాత్ర పోషించే క్రమంలో సభలో మాట్లాడే సమయంలో జరుగుతున్న పరిణామాలు నన్ను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేసేలా ఉన్నాయి. సభలో మాట్లాడకుండా చేయడం, అర్ధంతరంగా మైక్ కట్ చేయడం చాలా అవమానకరం. ఈ ప్రక్రియ ప్రజాస్వామ్య స్ఫూర్తికి సరైంది కాదు’ అని పేర్కొంటూ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క లేఖ రాశారు. పార్టీ ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, రాజగోపాల్‌రెడ్డి, వీరయ్య, సీతక్కతో మంగళవారం అసెంబ్లీలో స్పీకర్‌ను కలసి ఈ లేఖను అందజేశారు. ప్రజాస్వామ్యంలో అత్యున్నత స్థానమైన అసెంబ్లీలో ఏ విభాగం బలహీనపడినా ప్రజాస్వామ్య పునాదులకు పెను ప్రమాదం ఏర్పడుతుందని ఆ లేఖలో తెలిపారు. కాంగ్రెస్ సభ్యుల ఫిరాయింపులపై లేఖ ఇచ్చే సమయంలో ప్రతిపక్ష నేతగా ఫొటో దిగాలను కున్నప్పుడు స్పీకర్ అంగీకరించకపోవడం తన మనసును తీవ్రంగా గాయపర్చిందని పేర్కొన్నారు. శాసనసభాపక్ష నాయకుడిగా బడ్జెట్‌పై చర్చలో భాగంగా వివరణలపై మాట్లాడుతున్నప్పుడు అర్ధంతరంగా మైక్ కట్ చేయడం తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. దశాబ్దాల పోరాటం తర్వాత ఏర్పడిన రాష్ట్రం సామాజిక తెలంగాణగా రూపొందాలని ఆశించామని, కానీ సభలో తన పాత్ర పోషించకుండా అడుగడుగునా అడ్డుపడుతున్న పరిణామాలు ఏ విధంగా సామాజిక తెలంగాణ నిర్మాణానికి దోహదపడతాయో ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరారు. తమ హక్కులను కాపాడాలని, సభాపతి స్థానంలో రాగద్వేషాలకు అతీతంగా తాము అవమానాలకు గురికాకుండా, ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని ఆ లేఖలో స్పీకర్‌ను భట్టి కోరారు. ఆత్మగౌరవంతో మాట్లాడలేని పరిస్థితి.. అంతకుముందు కాంగ్రెస్ సభ్యులు మంగళవారం సభకు హాజరవుతున్న సమయంలో నల్ల కండువాలు ధరించి గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి మాట్లాడుతూ తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని విమర్శించారు. సభలో తమ గొంతు నొక్కు తున్నారని, కుట్రలతో తమను మాట్లాడ నీయకుండా చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను కూలదోస్తున్నారని, ఏ రంగం పనిచేయకుండా అడ్డుపడుతున్నారని విమర్శించారు. తన పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితేంటని ప్రశ్నించారు. ప్రతి పక్షాలను నిర్వీర్యం చేసే కుటిల యత్నాలను ప్రజలు గమనించాలని భట్టి కోరారు.