సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారీ బడ్జెట్‌పై చర్చించి ఆమోదం పొందేందుకు గాను అసెంబ్లీ సమావేశాలను కేవలం 6 రోజులే నిర్వహించడం పట్ల కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) అసంతృప్తి వ్యక్తం చేసింది. కేవలం మొక్కుబడిగా చర్చించేందుకు అసెంబ్లీ సమావే శాలను అలంకార ప్రాయంగా నిర్వహించారని సీఎల్పీ నేత భట్టి ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలసి గన్‌పార్క్ మీడియా పాయింట్ వద్ద భట్టి మాట్లాడారు.
కేవలం 6 రోజులపాటు చర్చ జరిపి రూ. 2.30 లక్షల కోట్ల బడ్జెట్‌ను ఆమోదించుకొని వెళ్లిపోయిన ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బడ్జెట్‌పై చర్చకు కనీసం 30 రోజులు అవసరమని, ప్రభుత్వ తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు.
2023 నాటికి రూ.6 లక్షల కోట్ల అప్పులు..
రీ డిజైన్ చేసిన ప్రాజెక్టుల డీపీఆర్‌లను సభలో ప్రవేశపెట్టకుండా ప్రభుత్వం పారిపోయిందని, ఈ విషయంలో అవకతవకలు జరిగినట్టు తమకు అనుమానం కలుగుతోందని భట్టి పేర్కొన్నారు. ఏటా రూ. 50 వేల కోట్ల వరకు అప్పులు తీసుకొని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెడుతోందని, 2023కల్లా అప్పులు రూ. 5.5 లక్షల నుంచి రూ.6 లక్షల కోట్లకు చేరుకుంటాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment