సర్వమత సమానత్వ భావన భారతదేశంలో మినహా మరెక్కడా కనిపించదు. ఈ లక్షణమే ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి భారత్‌ను వేరు చేసి, ప్రత్యేకతను అందిస్తుంది. ఇక్కడ అన్ని మతాల ప్రజలు సమైక్యంగా నివసిస్తున్నారు. దీంతో అన్ని మతాలవారి పండుగలు మన దేశంలో వైభవంగా జరగుతుంటాయి.
ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా జనవరి ఒకటిన నూతన సంవత్సరం జరుపుకుంటారు. ఆ రోజన ప్రజలంతా పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. కానుకలు, స్వీట్లు మొదలైనవి పంచుకుంటారు. అయితే మన దేశంలో జనవరి ఒకటి అసలైన కొత్త సంవత్సరం కాదనే వాదన వినిపిస్తుంటుంది. భిన్నత్వంలో ఏకత్వం అనే సిద్ధాంతాన్ని నమ్మే మన దేశంలోని ప్రజలు ఏడాదికి ఐదుసార్లు కొత్త సంవత్సరం జరుపుకుంటారు. ఈ కొత్త సంవత్సరాలను వివిధ మత విశ్వాసాల ప్రకారం చేసుకుంటారు.
హిందువులు
హిందువుల నూతన సంవత్సరం చైత్ర శుక్ల పక్షంలో నిర్ణీత తేదీన వస్తుంది. బ్రహ్మ దేవుడు విశ్వ సృష్టిని ప్రారంభించిన రోజున నూతన సంవత్సరం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
క్రైస్తవులు
రోమన్ పాలకుడు జూలియస్ సీజర్ జనవరి ఒకటిని నూతన సంవత్సరంగా ప్రకటించిన మొదటి వ్యక్తి అని చెబుతారు. అయితే ఆ తరువాత పోప్ గ్రెగొరీ ఇందులో కొన్ని సవరణలు చేసి, తన మత గురువును సంప్రదించి, లీప్ ఇయర్‌ని దానికి జోడించి, కొత్త గ్రెగోరియన్ క్యాలెండర్‌ను రూపొందించారు. దీని ప్రకారం కూడా జనవరి ఒకటినే నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. నాటి నుంచి గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జనవరి ఒకటిన నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు.
పార్సీయులు
పార్సీయులు ఆగస్టు 19న నూతన సంవత్సరాన్ని నవరోజ్ పేరుతో జరుపుకుంటారు. మూడు వేల సంవత్సరాల క్రితం షా జంషెడ్జీ దీనిని మొదటిసారిగా జరుపుకున్నారని పార్సీయులు నమ్ముతారు.
పంజాబీయులు
సిక్కు నానాక్షహి క్యాలెండర్ ప్రకారం సిక్కు మతానికి చెందినవారు వైశాఖ మాసం తొలి రోజున తమ నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు.
జైనమతస్తులు
జైన సమాజానికి చెందినవారు దీపావళి మరుసటి రోజును నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. దీనిని వీర్ నిర్వాణ సంవత్ అని అంటారు.
ఇది కూడా చదవండి: వైష్ణోదేవి సమక్షంలో నూతన సంవత్సరం సందడి
Comments
Please login to add a commentAdd a comment