దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు | New Year Celebration in the Country | Sakshi
Sakshi News home page

New Year Celebration: దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు

Jan 1 2024 7:37 AM | Updated on Jan 1 2024 7:37 AM

New Year Celebration in the Country - Sakshi

దేశవ్యాప్తంగా ప్రజలంతా 2024 నూతన సంవత్సరాన్ని ఉత్సాహంగా స్వాగతించారు. ఆదివారం అర్ధరాత్రి రాత్రి 12 గంటలకు ప్రజలంతా పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు తమదైన రీతిలో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. 
 

పలువురు కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి పర్యాటక ప్రదేశాలకు వెళ్లగా, మరికొందరు తమ నగరంలోనే ఉంటూ నూతన సంవత్సర వేడుకలు చేసుకున్నారు. పలుచోట్ల నూతన సంవత్సరాన్ని బాణసంచా  వెలుగులలో జరుపుకోవడం కనిపించింది. పలు ప్రాంతాల్లోని ప్రజలు కొత్త సంవత్సరం సందర్భంగా దేవాలయాలను సందర్శిస్తున్నారు. 

కర్ణాటకలోని బెంగళూరులో జనం వీధుల్లో డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఇక్కడి ఎంజీ రోడ్డులో  జనం ఎంతో ఉత్సాహంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు.

ఒడిశాలోని భువనేశ్వర్‌లో బాణాసంచా వెలిగించి, నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ బాణాసంచా వెలుగులు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని వివిధ నగరాల్లోని వివిధ ప్రదేశాలలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. లక్నోలోని హజ్రత్‌గంజ్‌లో నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ కనిపించారు. నోయిడాలో కూడా ప్రజలు తమదైన శైలిలో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు.

కొందరు సంగీత, నృత్యాలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలకగా, మరికొందరు ఆలయాల్లో పూజలు నిర్వహిస్తూ నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఢిల్లీలోని ఝండేవాలన్ ఆలయంలో నూతన సంవత్సర హారతిలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు.

న్యూ ఇయర్ సందర్బంగా పోలీసులు బందోబస్తు విధులు నిర్వహిస్తూ కనిపించారు. ఢిల్లీలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement