![India Increased the Security of Chabad House - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/11/chabad-house.jpg.webp?itok=GA_O0fOa)
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపధ్యంలో ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం, చాందినీ చౌక్‌లోని చాబాద్ హౌస్ చుట్టూ పోలీసులను గట్టి నిఘా ఏర్పాటు చేశారు? ఇంతకీ చాబాద్ హౌస్ అంటే ఏమిటి? దీనితో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి సంబంధం ఏమిటనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
చాబాద్ హౌస్ చరిత్రలోకి వెళితే.. 17-18 శతాబ్దంలో రష్యాలో జారిజం రాజ్యమేలుతున్నప్పుడు యూదులపై అనేక దురాగతాలు జరిగాయి. వారు వేధింపులకు గురయ్యారు. చిన్న చిన్న విషయాలకే వారిని జైల్లో పెట్టి కొరడాలతో కొట్టేవారు. దీంతో యూదులు తమ ఉనికి కోసం పోరాటం మొదలుపెట్టారు. 18వ శతాబ్దంలో లియాడీకి చెందిన రబ్బీ ష్నూర్ జల్మాన్, మరో యూదు మత నాయకుడు కలిసి చాబాద్-లుబావిచ్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.
ఈ ఉద్యమం ఉద్దేశ్యం యూదులను ఏకం చేయడం. వారిని ఒక వేదికపైకి తీసుకురావడం. 19వ శతాబ్దంలో ఐరోపాలో ముఖ్యంగా జర్మనీలో యూదుల హోలోకాస్ట్ ప్రారంభమైనప్పుడు, రబ్బీ యోసెఫ్ యిట్జాక్ ష్నీర్సన్ నాయకత్వంలో ‘చాబాద్’ ఉద్యమం తిరిగి ఊపందుకుంది. యూదు మత పెద్దలు ప్రపంచవ్యాప్తంగా ‘చాబాద్ హౌస్’లను తెరవడం ప్రారంభించారు. వీటి ఉద్దేశ్యం యూదు ప్రజలకు సహాయం చేయడమే. వారు ఎక్కడున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకే వీటిని ఏర్పాటు చేశారు. ‘chabad. org’లో అందించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలోని 85కుపైగా దేశాలలో 3500 చాబాద్ హౌస్‌లు పనిచేస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే చాబాద్ హౌస్ అనేది యూదు సమాజానికి ఒక కమ్యూనిటీ సెంటర్.
ఇజ్రాయిలీలు, యూదుల కోసం చాబాద్ హౌస్‌లలో ప్రత్యేక తరగతులు, వర్క్‌షాప్‌లు, ఉపన్యాసాలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. మతపరమైన విషయాలపై కూడా అవగాహన కల్పిస్తారు. భారతదేశంలో రెండు చాబాద్ హౌస్‌లు ఉన్నాయి. ఒకటి ముంబైలో, మరొకటి ఢిల్లీలో ఉంది. ఇజ్రాయెలీ, యూదు పర్యాటకులు చాబాద్ హౌస్‌లో విశ్రాంతి తీసుకోవచ్చు. ఇజ్రాయెలీ వంటకాలను రుచిచూడవచ్చు. 2011లో ముంబైపై ఉగ్రవాదులు దాడి జరిగినప్పుడు చాబాద్ హౌస్‌పై కూడా దాడి జరిగింది. ఆ ఘటన తర్వాత ఢిల్లీ, ముంబైలలోని చాబాద్ హౌస్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఇది కూడా చదవండి: ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అంటే ఏమిటి? ఈ శనివారం ఆకాశంలో ఏం జరగనుంది?
Comments
Please login to add a commentAdd a comment