
తిరుపతిరావు రూపొందించిన క్యాలెండర్
గణిత అవధాని రూపకర్త డీఎస్‌ఎన్ శాస్త్రి పేరులో అక్షరాలను కోడ్‌గా తీసుకుని 2001 నుంచి 2075 వరకు క్యాలెండర్ తీర్చిదిద్దారు.
కంచిలి(శ్రీకాకుళం జిల్లా): స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కంచిలి మండలం బూరగాం గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు, గణిత అవధాని మడ్డు తిరుపతిరావు 75 ఏళ్ల క్యాలెండర్ ఒకే పేజీలో తీర్చిదిద్దారు. గణిత అవధాని రూపకర్త డీఎస్‌ఎన్ శాస్త్రి పేరులో అక్షరాలను కోడ్‌గా తీసుకుని 2001 నుంచి 2075 వరకు క్యాలెండర్ తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా తిరుపతిరావును పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.
చదవండి: అక్కడో మాట.. ఇక్కడో మాట.. అచ్చెన్న దొంగాట!