సాక్షి, హైదరాబాద్: ఎక్సైజ్ శాఖ ఆదాయానికి గండి కొడుతున్న ముఠాల ఆగడాలను ఎక్కడికక్కడ శాఖ సిబ్బంది అడ్డుకుని ఆదాయాన్ని పెంచారని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రొహిబిషన్, ఎక్సైజ్ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన కేలండర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.
ఆయుధాలు లేకుండా ధైర్య సాహసాలతో ఒడిశాలో అక్రమంగా మద్యం తయారు చేస్తున్న మాఫియా ముఠాను అధికారులు పట్టుకున్నారని తెలిపారు. గుడుంబా, గంజాయి రహిత రాష్ట్రంగా నిలపడానికి ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారులు సమర్థవంతంగా కృషి చేశారని శ్రీనివాస్‌గౌడ్ ప్రశంసించారు. అధికారులపై ఒత్తిడి లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
అలాగే త్వరలో అన్ని జిల్లాల ఎక్సైజ్ సూపరింటెండెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించి హెడ్ కానిస్టేబుళ్ల సమస్యలను పరిష్కరిస్తామని, పదోన్నతులు, ఉద్యోగుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీఇచ్చారు. భాగ్యనగర్ టీఎన్జీవోస్ ( గచ్చిబౌలి) మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ కేలండర్‌ను తన క్యాంపు కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment