
‘నకిలీ విత్తన బాధితులకు పరిహారమివ్వాలి’
సాక్షి, హైదరాబాద్: నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారమివ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. సరైన నియంత్రణ లేక నకిలీ విత్తనాలు మార్కెట్‌లోకి వచ్చాయన్నారు. దీనికి కారణమైన కంపెనీలు, బాధ్యులను శిక్షిం చాలన్నారు. నష్టపోయిన రైతు లకు పంటపై పెట్టిన ఖర్చు ను తిరిగి చెల్లించాలని కోరా రు.
ప్రభుత్వం మొత్తం రుణమాఫీ చేయకపోవడం తో నకిలీ విత్తనాల బెడద పులి మీద పుట్రలా మారిం దన్నారు. వెంటనే రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం కరువు సహాయం కింద రూ.790 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించినా, అవి ఇప్పటివరకు అందలేదన్నారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడడానికి ప్రభుత్వ విధానాలే కారణమని, వీటి నియంత్రణకు తగు చర్యలు చేపట్టాలని కోరారు.