
నకిలీలపై నజర్!
► ఎరువులు, విత్తన విక్రయాలపై టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక నిఘా
► జిల్లాలో ప్రాసెసింగ్ ప్లాంట్ల తనిఖీలకు 14 ప్రత్యేకబృందాలు
► మోసాలకు పాల్పడితే విత్తన వ్యాపారుల
► లెసైన్స్‌లు రద్దు: జేడీఏ
మహబూబ్‌నగర్ వ్యవసాయం: రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు అంటగడుతూ వారిని మోసం చేస్తున్న వ్యాపారులు, డీలర్లపై కొరడా ఝళిపించేందుకు వ్యవసాయశాఖ రంగం సిద్ధమైంది. అందుకోసం టాస్క్‌ఫోర్స్ విభాగాన్ని ఏర్పాటుచేసింది. గత ఖరీఫ్, రబీ సీజన్లలో వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు నష్టపోయిన రైతులు అప్పులబాధ నుంచి గట్టెక్కుందుకు ఖరీఫ్‌కు సాగుకు సన్నద్ధమయ్యారు. వర్షాలు ఊరిస్తున్న తరుణంలో విత్తనాలు, ఎరువులను సిద్ధం చేసుకునే పనిలోపడ్డారు. ఇదే అదునుగా భావించిన కొన్ని ప్రైవేట్ విత్తన కంపెనీల డీలర్లు, వ్యాపారులు నకిలీ విత్తనాలు, ఎరువులను వారికి అంటగట్టేందుకు సిద్ధమయ్యారు.
ఇప్పటికే గుంటూరు, కర్నూలు, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి జిల్లాకు పెద ్దమొత్తంలో నకిలీ విత్తనాలు తెచ్చినట్లు సమాచారం. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ లేకపోవడంతో పత్తికి బదులుగా ప్రత్యామ్నాయ పం టలు వేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచిస్తున్నా ప్రై వేట్ వ్యాపారులు అధిక దిగుబడులు వస్తాయని రైతుల కు పత్తి విత్తనాలను అంటగడుతున్నారు. వారి మోసాల ను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు బాలునాయక్ జిల్లాలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. బుధవారం నుంచి విస్తృత తనిఖీలు చేపట్టి అక్రమార్కుల ఆటకట్టించాలని సూచించారు.
ఇక అక్రమాలకు చెల్లుచీటి!
జిల్లాలో ఉన్న విత్తన, ఎరువుల వ్యాపార కేంద్రాలు, డీలర్ షాపుల్లో తనిఖీలు చేసేందుకు ఏడీఏలతో నియోజ కవర్గానికి ఒకటి చొప్పున 14 బృందాలను ఏర్పాటుచే స్తూ జేడీఏ నిర్ణయించారు. అంతేకాకుండా జిల్లాలో ఉన్న పత్తి ప్రాసెసింగ్ ప్లాంట్లలో తనిఖీలు నిర్వహించేందుక ఒక ఏడీఏ, ఒక ఎంఏఓతో కూడిన రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. తమకు కే టాయించిన పరిధిలో తనిఖీలు నిర్వహించి, అప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని జేడీఏ ఆదేశించారు. అక్రమాలకు పాల్పడే వారిని ఉపేక్షించరాదని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తనిఖీబృందాలకు సూచించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించేవారిపై నిఘా ఉంచాలని దిశానిర్దేశం చేశారు.