నకిలీ విత్తనాల వ్యవహారంలో హైకోర్టు వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: నకిలీ విత్తనాలు తయారు చేస్తున్న, విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్న ప్రభుత్వం, ఆ విత్తనాలను ధ్రువీకరిస్తున్న అధికారులను కూడా బా«ధ్యులు చేయాల్సిన అవసరముందని ఉమ్మడి హైకోర్టు అభిప్రాయపడింది. విక్రయదారులు అమ్మే విత్తనాలు మంచివేనని అధికారులు ధ్రువీకరించడం వల్లే రైతులు వాటిని కొనుగోలు చేస్తున్నారని, అలాంటప్పుడు ధ్రువీకరిస్తున్న అధికారులను కూడా బాధ్యులను చేయడం సబబుగా ఉంటుందని వ్యాఖ్యానించింది.
రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించారంటూ మండల వ్యవసాయాధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా, రెంటచింతల పోలీసులు బ్రహ్మపుత్ర హైబ్రీడ్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలంటూ సంస్థ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో బుధవారం విచారణ జరిపారు. వాదనల సందర్భంగా న్యాయమూర్తి పై వ్యాఖ్యలు చేస్తూ ప్రస్తుత దశలో ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు.
ధ్రువీకరిస్తున్న అధికారుల్నీ బాధ్యులను చేయాలి
Published Thu, Dec 22 2016 2:50 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
Advertisement
Advertisement