సాక్షి, హైదరాబాద్: నకిలీ విత్తనాలు, గులాబీ రంగు పురుగు తాకిడికి రాష్ట్రంలో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఎన్నో కష్టాలను భరించి రైతులు ఈ ఏడాది భారీ ఎత్తున పత్తిని పండించినా.. సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వా రా నామ మాత్రంగానే పత్తిని కొంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతులు ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు రైతులు పెట్టుబడి పెట్టారని తెలిపారు. పంట రుణ మాఫీ, పంటలకు మద్దతు ధర, వ్యవసాయ అనుబంధ అంశాలపై బుధవారం శాసన మండలిలో జరిగిన స్వల్పకాల చర్చలో మాట్లాడా రు.
కేంద్రతో మాట్లాడి 15 శాతం వరకు తేమ తో పత్తి కొనుగోళ్లకు ఒప్పించాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులపై పెట్టి న కేసులను ఎత్తివేయాలని కోరారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాల విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయన్నారు. అంతకు ముందు మంత్రి ఈటల మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల సంక్షేమంకోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. రూ.16,124.37 కోట్ల పంట రుణాలను మాఫీ చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment