హైదరాబాద్: నగరంలో భారీ ఎత్తున నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. హయత్ నగర్ పరిధిలోని మునుగానూరులో ఎటువంటి అనుమతులు లేకుండా నడిపిస్తున్న పత్తి, కూరగాయల విత్తనాల గోదాంపై హయత్ నగర్ పోలీసుల వ్యవసాయ అధికారులు దాడులు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గోదాంలో 850 బెండకాయ విత్తనాల ప్యాకెట్లు, 500 పత్తి విత్తనాల ప్యాకెట్లు, 15 బ్యాగుల మక్కా జొన్న విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.