తొండుపల్లిలోని ఓ గోదాంపై అధికారుల దాడులు..
శంషాబాద్ రూరల్ (రాజేంద్రనగర్):
కోళ్ల ఫారం షెడ్డులో గుట్టుచప్పుడు కాకుండా నకిలీ విత్తనాలు తయారు చేస్తున్న ఓ గోదాంపై పోలీసులు, వ్యవసాయా ధికారులు దాడులు నిర్వహించారు. దాదాపు రూ.60 లక్షల విలువైన వివిధ రకాల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లి సమీపంలో ఓ ఫంక్షన్ హాలు పక్కన సుదర్శన్‌రెడ్డికి చెందిన కోళ్లఫారం షెడ్డు ఉంది. ఈ షెడ్డును రెండు నెలల కిందట అనంతపురానికి చెందిన మనోజప్ప అద్దెకు తీసుకున్నాడు.
ఇందులో వివిధ రకాల విత్తనాలను కూలీల చేత రాత్రి వేళల్లో ప్యాకింగ్ చేయిస్తున్నాడు. సమాచా రం అందుకున్న అధికారులు శుక్రవారం సాయంత్రం గోదాంపై దాడి చేశారు. అక్కడ కిరణ్–88, అక్షయ్–669, మహేం ద్ర హైబ్రిడ్, గాయత్రి–12, తేజ–505 రకా ల బ్రాండ్‌లతో ఉన్న ప్యాకెట్లు, యూరియా బస్తాల్లో ఉన్న విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గోదాం నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు.
రూ. 60 లక్షల నకిలీ విత్తనాలు స్వాధీనం
Published Sat, Jul 22 2017 2:12 AM | Last Updated on Tue, Sep 5 2017 4:34 PM
Advertisement
Advertisement