కల్తీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు
దుకాణాదారులకు ఏడీఏ ఉమామహేశ్వరరెడ్డి హెచ్చరిక
నంద్యాలరూరల్: రైతులకు ఎవరైనా కలీ్తవిత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చర్యలు తప్పవని దుకాణాదారులకు ఏడీఏ ఉమామహేశ్వరరెడ్డి హెచ్చరించారు.నంద్యాలలోని ఎరువులు, విత్తనాల దుకాణాలను ఆయన శనివారం తనిఖీ చేశారు. సంతోష్‌రెడ్డి ఏజెన్సీలో నిబంధనలకు విరుద్ధంగా రూ.7.28లక్షలు విలువ గల ఎరువులను విక్రయించకుండా తాత్కాలికంగా నిలిపి వేసినట్లు చెప్పారు. అలాగే రైతులుకు బిల్లులు వేయకుండా వంద ప్యాకెట్లను వెలుగోడు మండలం గుంతకందాలకు పంపినందుకు గణేష్ సీడ్స్ యాజమాన్యంపై చర్యలకు సిఫార్సు చేస్తున్నట్లు చెప్పారు. ఈ తనిఖీల్లో నంద్యాల ఏఓ అయూబ్‌బాషా, కర్నూలు జేడీఏ ఆఫీసు ఏఓ విశ్వనాథం, నంద్యాల రైతు శిక్షణా కేంద్రం ఏఓలు నిరంజన్ పాల్గొన్నారు.