హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో వ్యవసాయ పనులు ప్రారంభమైనా, నాణ్యమైన విత్తనాలను అందించడంలో ప్రభుత్వం విఫలమైందని టీపీసీసీ కిసాన్ సెల్ అధ్యక్షుడు ఎం.కోదండ రెడ్డి విమర్శించారు. పార్టీ నేతలు కె.మల్లేశం, ఎం.జైపాల్ రెడ్డితో కలిసి గాంధీభవన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, బ్యాంకు రుణాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. రుణబాధలు పెరిగి రైతులు ఆత్యహత్యలు చేసుకుంటున్నా తెలంగాణరాష్ట్రంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నదన్నారు. రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యతలను విస్మరించిన ప్రభుత్వం కేవలం రాజకీయ కుట్రలపైనే దృష్టి పెట్టిందని కోదండ రెడ్డి విమర్శించారు. రైతాంగానికి నాణ్యమైన విత్తనాలను, ఎరువులను అందించాలని ఆయన డిమాండ్‌చేశారు.
నకిలీ విత్తనాలను అరికట్టండి: కోదండ రెడ్డి
Published Sat, Jun 13 2015 8:14 PM | Last Updated on Sun, Sep 3 2017 3:41 AM
Advertisement