
నకిలీ విత్తనాలపై పోలీసు నజర్
♦ రాష్ట్రవ్యాప్తంగా 1,500 దుకాణాల్లో సోదాలు
♦ 75కు పైగా కేసులు నమోదు
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ సీజన్‌లో నకిలీ విత్తనాలు రైతన్న నడివిరుస్తు న్నాయి. పుట్టగొడుగుల్లా పెరిగిపోయి న కంపెనీలు మార్కెట్‌లోకి నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్నాయి. ప్రచా రంతో రైతులను మాయచేసి నకిలీ విత్తనాలు అంటగడుతున్న కంపెనీ లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నకిలీ విత్తనాలు విక్రయించే వ్యాపారులు, విత్తన సంస్థలు, విత్తన కేంద్రాలపై దాడులు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీస్ శాఖ వారం రోజులుగా విత్తన విక్రయ దుకాణాలపై దాడులు జరుపుతోంది.
వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం వల్లే..
నకిలీ, కల్తీ, కాలం చెల్లిన విత్తనాలను విక్రయిస్తున్న విత్తన దుకాణాలపై పోలీసులు ఆకస్మిక దాడులు జరుపుతున్నా రు. గత శనివారం నుంచి ఇప్పటివరకు వరంగల్, హైదరాబాద్ జోన్లలో 1,500కు పైగా దుకణాలపై దాడులు చేసినట్లు పోలీస్ శాఖ వెల్లడించింది. 2014, 2015లోపు విక్రయించాల్సిన విత్తనాలను రైతులకు అంటగడుతున్నా రని తెలిపింది. వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం కూడా వ్యాపారులకు కలిసివస్తోందని, సీజన్ ప్రారంభానికి ముందే విత్తన దుకాణాలు, విక్రయ కేం ద్రాల్లో తనిఖీ చేయకపోవడం, మా మూళ్ల మత్తులో ఉండటంవల్లే వ్యాపా రుల దందా వర్ధిల్లుతోందని చెబుతు న్నారు. కాలం చెల్లిన ప్యాకెట్లపై తాజా తేదీ స్టిక్కర్లు వేయడం, పాత విత్తనాల ప్యాకెట్ల రూపంలో కాకుండా విడిగా విక్రయించడం, కల్తీ, అసలు విత్తనాలు కలిపి కొత్త రకం బస్తాల్లో పెట్టి అమ్ముతున్నట్లు విచారణలో తేలింది.
క్రిమినల్, సీడ్స్ యాక్ట్ కింద కేసులు..
ప్రభుత్వ ఆదేశాలతో కదిలిన పోలీస్, వ్యవసాయ శాఖలు విత్తన దుకాణాలపై ఆకస్మిక దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నాయి. నాసి రకం విత్తనాలు అంటగడుతూ మోసాలకు పాల్పడుతున్న వారిపై ఐపీసీ సెక్షన్ 420 కింద క్రిమినల్ కేసు, సీడ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నా మని డీజీపీ అనురాగ్‌శర్మ ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్రవ్యాప్తం గా 75 కేసులకుపైగా నమోదు చేశామన్నారు. వరంగల్ జోన్‌లో 704, హైదరాబాద్ జోన్‌లో 809 దుకాణాల్లో సోదాలు నిర్వహించామన్నారు. రామగుండం, కరీంనగర్, ఖమ్మం,ఆదిలాబాద్,నిర్మల్, భైంసా, ఆసిఫాబాద్, మహ బూబ్‌నగర్, సూర్యాపేట తదితర ప్రాంతాల్లోని దుకాణా లపై ఎక్కువగా కేసులు నమోదయినట్లు తెలిపారు.