'ఆ మంత్రి చరిత్ర అంతా అవినీతే' | bhatti vikramarka fire on pocharam srinivas | Sakshi
Sakshi News home page

'ఆ మంత్రి చరిత్ర అంతా అవినీతే'

Published Tue, Oct 25 2016 5:35 PM | Last Updated on Mon, Oct 8 2018 9:21 PM

'ఆ మంత్రి చరిత్ర అంతా అవినీతే' - Sakshi

'ఆ మంత్రి చరిత్ర అంతా అవినీతే'

హైదరాబాద్: నకిలీ విత్తనాల దొంగలు రైతులను దోచుకుంటుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహిస్తోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. నకిలీ విత్తనాలు అంశంపై హైదరాబాద్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చరిత్ర అంతా అవినీతిమయమేనని మండిపడ్డారు.

గతంలో స్టేషనరీ కుంభకోణంలో మంత్రి పోచారం పదవిని కోల్పోయారని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత భట్టి తెలిపారు. కేసీఆర్ లాంటి వ్యక్తి రాష్ట్రాన్ని పాలించడం మన దురదృష్టమన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ, కోట్ల రూపాయలతో నూతన సచివాలయం కడతారా అని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆయన భట్టి విక్రమార్క సూటిగా ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement