మాట్లాడుతున్న వెంకట్‌రెడ్డి
సాక్షి, గద్వాల న్యూటౌన్: మిగులు బడ్జెట్‌గా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతూ.. రాష్ట్రం లో అన్నివర్గాలకు వ్యతిరేకంగా పాలన కొనసాగించిన కేసీఆర్‌ను ఈసారి ఎన్నికల్లో ఓ డించి కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని టీపీసీసీ అ ధికార ప్రతినిధి పేరి వెంకట్‌రెడ్డి అన్నారు.
గురువారం స్థానిక డీకే బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అవలంబించిన ఆర్థిక విధానాలతో రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందన్నారు. అన్ని జిల్లాల్లో ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు.
ఉద్యోగులంతా భయబ్రాంతులతో పనిచేస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలకు ఎలాంటి లాభం చేకూరలేదన్నారు. నాలుగున్నరేళ్లలో ఒక్క డీఎస్సీ ప్రకటించలేకపోయిందని విమర్శించారు. విద్యారంగంలో 2015 నుంచి పదోన్నతులు కల్పించలేదన్నారు. రూ.1,200 కోట్లు మెడికల్ రీయంబర్స్‌మెంట్ బిల్లులు టీఆర్‌ఎస్ ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిందని, దీంతో కార్పొరేట్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశాయన్నారు.
ప్రభుత్వ నిర్వాకంతో పేదలతోపాటు ఉద్యోగుల కుటుంబాలు తీవ్ర ఆవేదనలో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లు చేస్తామన్నారు. అలాగే 43 శాతం ఐఆర్‌తోపాటు 63 శాతం ఫిట్‌మెంట్ ఇస్తామన్నారు. 10 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్పారు. సమావేశంలో టీపీసీసీ కార్యదర్శి హర్షవర్ధన్‌రెడ్డి, నాయకులు వెంకట్రాములు, సురేందర్‌గౌడ్, అబ్రహాం, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment