Gadwal Bidda Death News Viral In Social Media: ‘నువ్వెనివో నాకు తెల్వదు..’ అంటూనే కోట్లాది మందికి పరిచయమైన చిన్నారి ‘గద్వాల్‌బిడ్డ’ ఇక లేడనే వార్త సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన ఈ చిన్నారి.. నిత్యం వీడియోలు, మీమ్స్, స్టిక్కర్లతో ఏదో ఒక దగ్గర కనిపిస్తున్న విషయం తెలిసిందే. అలాంటి చిన్నారి హఠాన్మరణం విషయం తెలియగానే.. ఇంటర్నెట్‌లో చాలామంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
అది మీమ్స్ పేజీ ఆరంభంలో ఉన్నరోజులు. ‘ఐతే ఏంటి?, సీవోసీ’ లాంటి కొద్దిపాటి పేజీలు మాత్రమే పాపులర్ అయిన సమయం. ఆ టైంలో దర్శకుడు ఆర్జీవీ ప్రకటించిన ఓ టైటిల్‌పై దుమారం రేగింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఓ చిన్నారి చేసిన వీడియో తెగ వైరల్ అయ్యింది. గద్వాల్‌బిడ్డగా తననుతానూ పరిచయం చేసుకుంటూ.. ఆర్జీవీని దూషిస్తూ ఓ వీడియో పోస్ట్ చేసి వైరల్ అయ్యాడు ఆ పిలగాడు. ఆపై దళితులను కించపరిచేలా వ్యవహరించాడంటూ దళిత సంఘాలు ఆ చిన్నారిపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.
మైనర్ కావడంతో పోలీసుల సమక్షంలోనే అతనితో క్షమాపణలు చెప్పించగా.. ఆ సమయంలో సంభాషణలు, అతని ఏడుపు సైతం వైరల్ అయ్యింది. ఆపై చాలాకాలం ఇంటర్నెట్‌కు దూరంగా ఉన్నప్పటికీ ఈ చిన్నారి మీమ్స్ స్టఫ్‌గా మారాడు. ట్రోల్ వీడియోస్, మీమ్స్ టెంప్లేట్, స్టిక్కర్స్ రూపంలో వైరల్ అయ్యాడు. కొద్దిగ్యాప్ తర్వాత కారులో కునుకు తీసిన వీడియో ఒకటి, ఆపై దసరా శుభాకాంక్షలు చెప్తూ ఉన్న వీడియో సైతం వైరల్ అయ్యింది. ఈ క్రమంలో అతని హఠాన్మరణం వార్త.. ఇంటర్నెట్‌ను కుదిపేస్తోంది.
ఆ చిన్నారి అసలు పేరు మల్లికార్జున్‌రెడ్డి అని సమాచారం. ప్రస్తుతం ఓ సినిమాలోనూ అతని నటిస్తున్నాడని, ఆస్తమాతో అతను మృతిచెందినట్లు, ఈ విషయం అతని కుటుంబ సభ్యులే స్వయంగా వెల్లడించినట్లు సౌత్ ఇండియన్ థగ్స్ అనే పేజీ నుంచి మెసేజ్ వైరల్ అయ్యింది. స్వగ్రామం జోగులాంబా గద్వాల్ జిల్లాలోని వడ్డేపల్లి మండలం జిల్లేడుదిన్నెలో గద్వాల్ బిడ్డ ‘మల్లికార్జున్’ అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం.
‘నువ్వు ఎవనివో నాకు తెల్వదు, బండెక్కినంటే.. భయపడాలె, చూస్కోండి, ఖబడ్దార్‌బిడ్డా..’ డైలాగ్‌లతో గద్వాల్‌బిడ్డ పేరుతో మీమ్స్, వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. ఈ తరుణంలో.. చిన్నవయసులోనే ఆ చిన్నారి లేడనే వార్త ఇంటర్నెట్‌లో విషాదం నింపుతోంది. మీమ్స్, వీడియోల రూపంలో బతికే ఉంటాడంటూ పలువురు కామెంట్ల చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment