
సాక్షి, మహబూబ్‌నగర్: గద్వా ల జిల్లా పరిషత్ సీఈఓ విజయ నాయక్ సరెండర్..ఆ తర్వాత ఆమె కలెక్టర్ వల్లూరి క్రాంతిపై విమర్శలు గుప్పించడం హాట్‌టాపిక్‌గా మారింది. దీనిపై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డికి సీఈఓ ఫిర్యాదు చేయడం చర్చనీ యాంశమైంది. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ, ప్రభుత్వ పథకాల అమలులో అశ్రద్ధ వహిస్తూ, ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించకుండా పరిపాలనకు ఆటంకం కలిగిస్తున్నారంటూ విజయ నాయక్‌ను పంచా యతీరాజ్‌శాఖ కమిషనరేట్‌కు సరెండర్ చేస్తూ గద్వాల కలెక్టర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రెస్‌మీట్ నుంచే మంత్రికి ఫోన్..
తనను కలెక్టర్ వల్లూరు క్రాంతి సరెండర్ చేసి అన్యా యం చేశారంటూ ప్రెస్‌మీట్ నుంచే జెడ్పీ సీఈఓ..మంత్రి నిరంజన్‌రెడ్డికి ఫోన్ చేశా రు. తనను అన్యాయంగా సరెండర్ చేశా రని..ఈ ఉత్తర్వులను ఆపి న్యాయం చేయాలని కోరారు. తాను జిల్లాలో నిజాయితీగా విధులు నిర్వర్తిస్తున్నానని.. విధులు ఎలా నిర్వర్తిస్తున్నానో తన టూర్ డైరీని పరిశీలించాలని కోరారు. దీనిపై మంత్రి స్పందించి.. పూర్తి వివరాలు తెలుసుకుంటానని చెప్పారు. అయితే ఆమె ఆదివారం ఉదయం 10 గంటలకు ఫోన్ చేస్తానని చెప్పగా.. ఆయన సరేనని సమాధానమి చ్చారు.
కాగా.. జెడ్పీ సీఈఓ గతంలోనూ వివాదా స్పదంగా వ్యవహరించినట్లు ఉద్యోగవర్గాల్లో చర్చ జరుగుతోంది. అదనపు కలెక్టర్‌తో వాగ్వాదానికి దిగడం, మహిళా దినోత్సవం రోజు ఓ మహిళా అధి కారితో గొడవపడటం వంటి ఘటనలు ఉన్నాయని.. ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ సెల్‌లో బాధితులను విజయ నాయక్ పట్టించుకోరనే ఫిర్యాదు కలెక్టర్‌కు చేరినట్లు తెలిసింది. దీంతో ఆమెపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment