Zilla Parishad officers
-
గద్వాలలో సరెండర్ లొల్లి!.. హాట్‌టాపిక్‌గా మారిన వ్యవహారం
సాక్షి, మహబూబ్‌నగర్: గద్వా ల జిల్లా పరిషత్ సీఈఓ విజయ నాయక్ సరెండర్..ఆ తర్వాత ఆమె కలెక్టర్ వల్లూరి క్రాంతిపై విమర్శలు గుప్పించడం హాట్‌టాపిక్‌గా మారింది. దీనిపై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డికి సీఈఓ ఫిర్యాదు చేయడం చర్చనీ యాంశమైంది. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ, ప్రభుత్వ పథకాల అమలులో అశ్రద్ధ వహిస్తూ, ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించకుండా పరిపాలనకు ఆటంకం కలిగిస్తున్నారంటూ విజయ నాయక్‌ను పంచా యతీరాజ్‌శాఖ కమిషనరేట్‌కు సరెండర్ చేస్తూ గద్వాల కలెక్టర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రెస్‌మీట్ నుంచే మంత్రికి ఫోన్.. తనను కలెక్టర్ వల్లూరు క్రాంతి సరెండర్ చేసి అన్యా యం చేశారంటూ ప్రెస్‌మీట్ నుంచే జెడ్పీ సీఈఓ..మంత్రి నిరంజన్‌రెడ్డికి ఫోన్ చేశా రు. తనను అన్యాయంగా సరెండర్ చేశా రని..ఈ ఉత్తర్వులను ఆపి న్యాయం చేయాలని కోరారు. తాను జిల్లాలో నిజాయితీగా విధులు నిర్వర్తిస్తున్నానని.. విధులు ఎలా నిర్వర్తిస్తున్నానో తన టూర్ డైరీని పరిశీలించాలని కోరారు. దీనిపై మంత్రి స్పందించి.. పూర్తి వివరాలు తెలుసుకుంటానని చెప్పారు. అయితే ఆమె ఆదివారం ఉదయం 10 గంటలకు ఫోన్ చేస్తానని చెప్పగా.. ఆయన సరేనని సమాధానమి చ్చారు. కాగా.. జెడ్పీ సీఈఓ గతంలోనూ వివాదా స్పదంగా వ్యవహరించినట్లు ఉద్యోగవర్గాల్లో చర్చ జరుగుతోంది. అదనపు కలెక్టర్‌తో వాగ్వాదానికి దిగడం, మహిళా దినోత్సవం రోజు ఓ మహిళా అధి కారితో గొడవపడటం వంటి ఘటనలు ఉన్నాయని.. ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ సెల్లో బాధితులను విజయ నాయక్ పట్టించుకోరనే ఫిర్యాదు కలెక్టర్‌కు చేరినట్లు తెలిసింది. దీంతో ఆమెపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. -
జెడ్పీ కార్యాలయం కోసం అధికారుల వేట
సాక్షి, వరంగల్ రూరల్: నూతన జిల్లా పరిషత్ పాలక వర్గం ఏర్పాటైంది. కానీ ఆ పాలక వర్గానికి కార్యాలయం లేదు. జిల్లా పరిషత్ పాలకవర్గం కొలువుదీరేందుకు కొత్త జిల్లాల్లో జెడ్పీ భవనాలు ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లా యంత్రాంగం, జిల్లా పరిషత్ భవనం ఏర్పాటుకై అన్వేషణ మొదలుపెట్టింది. జూలై 5వ తేదీన నూతన పాలకవర్గం బాధ్యతలు చేపట్టనుంది. ఈ లోపు జిల్లా పరిషత్ భవనాన్ని ఏర్పాటు చేసేందుకు సంబంధిత శాఖ అధికారులు పలు భవనాలను పరిశీలిస్తున్నారు. జిల్లాలో 16 జెడ్పీటీసీలకు గాను 16 జెడ్పీటీసీలను టీఆర్ఎస్ పార్టీనే దక్కించుకోవడంతో జిల్లా పరిషత్ పీఠం సైతం టీఆర్ఎస్ పార్టీనే దక్కించుకుంది. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా గండ్ర జ్యోతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అన్నీ కార్యాలయాలు అర్బన్‌లోనే.. వరంగల్ రూరల్ జిల్లాకు జిల్లా కేంద్రం లేకపోవడంతో అన్నీ కార్యాలయాలు అర్బన్ జిల్లాలోనే ఏర్పాటు చేశారు. అర్బన్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, ఇతర ప్రభుత్వ శాఖల కార్యాలయాల కాంప్లెక్స్ నూతన భవనం నిర్మాణం అవుతుండటంతో ప్రభుత్వ, అద్దె భవనాల్లోకి మార్చారు. రూరల్ జిల్లాకు చెందినవి సైతం కొన్ని ప్రభుత్వ భవనాల్లో, మరికొన్ని అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పుడు జిల్లా పరిషత్ కార్యాలయం కోసం వేట ప్రారంభించారు. అద్దె భవనంలో ఏర్పాటు చేయాలా....ఏదైన ప్రభుత్వ భవనం ఉంటే అందులో కార్యాలయం, మీటింగ్ హాల్‌ను ఏర్పాటు చేయాలా అని జిల్లా యంత్రాంగం ఆలోచిస్తున్నారు. కొత్త జిల్లా ప్రతిపాదికనే.. కొత్త జిల్లాల వారీగా జిల్లా పరిషత్‌లను ఏర్పాటు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నికైన జిల్లా, మండల పరిషత్ పాలకవర్గాల పదవీకాలం త్వరలో ముగుస్తుంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాను ఆరు జిల్లాలుగా విభజించారు. వరంగల్ రూరల్ జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు, 16 మండలాలున్నాయి. వీటిలో దామెర, నడికూడ మండలాలు ఏర్పాటు అయ్యాయి. పాత మండలాలకు మండల పరిషత్ కార్యాలయాలు ఉన్నాయి. ఈ రెండు కొత్త మండలాలకు మండల పరిషత్ కార్యాలయాలు లేవు. రెండు కొత్త మండలాలకు సైతం మండల పరిషత్‌లు ఏర్పాటు చేసేందుకుందు ఏర్పాట్లు చేస్తున్నారు. కొనసాగుతున్న కసరత్తు జిల్లాల విభజన, కొత్త మండలాల ఏర్పాటు, తండాలు, గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడం రాష్ట్ర ప్రభుత్వం ఒకొక్కటిగా విభజిస్తూ వస్తుంది. జిల్లా పరిషత్, మండల పరిషత్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. జిల్లాల విభజన జరిగినప్పటికీ జిల్లా పరిషత్ ఉమ్మడి జిల్లాల కిందనే కొనసాగుతూ వస్తున్నాయి. త్వరలో జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవికాలం ముగియనున్నందున ఆలోపు కొత్త జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త జెడ్పీ కార్యాలయానికి ప్రత్యేక భవనం కోసం సంబంధిత శాఖ అధికారుల పరిశీలన చేస్తున్నట్లు తెలిసింది. హన్మకొండ మండల పరిషత్ కార్యాలయంలో వరంగల్ రూరల్ జిల్లా పరిషత్ కార్యాలయాన్ని ఏర్పాటు చే యాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. జెడ్పీ కార్యాలయం కోసం మూడు భవనాలను పరిశీలించినట్లు సమాచారం. ఈ కార్యాలయాల నుంచే ఎన్నికల ప్రక్రియ కొనసాగించడంతో పాటు పాలకవర్గం కొలువుదీరేటట్లు భవనం సిద్ధం చేస్తున్నారు. -
పనోడు అని సంబోధిస్తారా?
ఒంగోలు టూటౌన్ : జిల్లా పరిషత్ సీఈఓ టి. కైలాష్ గిరీశ్వర్‌ని పనోడు అని మిగిలిన ఉద్యోగులను చిన్న పనోళ్లని జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు సంబోధించడం దురదృష్టకరమని ఎంపీడీఓ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ బి. సాయికుమారి, మినిస్టీరియల్ స్టాఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాసకుమార్, పంచాయతీ కార్యదర్శిల అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ రామోహన్, పీఆర్ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్ వై. పోలయ్య (పాల్‌రాజ్), ఈఓఆర్డీల అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజశేఖర్ తదితరులు గురువారం తీవ్రంగా ఖండించారు. 18వ తేదీ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జరిగిన ఈ సంఘటన అందరినీ బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులంతా ప్రజలకు జవాబుదారీ తనంగా ఉండాలే కానీ ఒకరికి ఒకరు జవాబుదారీ తనం కాదని చెప్పారు. జరిగిన సంఘటనను పంచాయతీ రాజ్ డిపార్టుమెంట్ తరఫున అన్ని అసోషియేషన్లు తీవ్రంగా ఖండిస్తున్నాయని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. -
నవంబర్‌లో బదిలీ.. ఇప్పుడు రిలీవ్!
శ్రీకాకుళం: చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో జిల్లాపరిషత్ అధికారులు మళ్లీ మళ్లీ తప్పులు చేస్తున్నారు. వీరి నిర్వాకం వల్ల చేయని తప్పునకు చిరుద్యోగులు మానసిక వేదన అనుభవిస్తున్నారు. గత నవంబరులో జరిగిన బదిలీల్లో జిల్లాపరిషత్ కార్యాలయం నుంచి తొమ్మిది మంది జూనియర్ అసిస్టెంట్లను బదిలీ చేశారు. వారి స్థానాల్లో అంతమందినే వేర్వేరు ప్రాంతాల నుంచి తీసుకురావాల్సి ఉండగా, అంతకంటే ఎక్కువగా 11 మందిని జెడ్పీ కార్యాలయానికి బదిలీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఁసాక్షిరూ.లో కథనం ప్రచురితం కావడంతో అధికారుల్లో కదలిక వచ్చింది. ఉద్యోగులు న్యాయ పోరాటానికి సిద్ధమవుతారేమోనన్న భయంతో తప్పు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. జిల్లాపరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న ప్రకాష్ అనే జూనియర్ అసిస్టెంట్‌ను నవంబరులో సరుబుజ్జిలి ఎమ్పీడీవో కార్యాలయానికి బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న కుప్పిలి గీతను జెడ్పీ కార్యాలయంలో నియమించారు. అయితే ఏ కారణంతోనో అప్పట్లో ప్రకాష్‌ను రిలీవ్ చేయలేదు. గీత మాత్రం సరుబుజ్జిలిలో రిలీవ్ అయి శ్రీకాకుళం వచ్చేశారు. పోస్టు ఖాళీగా లేదనో.. మరే కారణమో తెలియక పోయినా గీత మెడికల్ లీవ్ పెట్టేశారు. మరోవైపు ప్రకాష్‌ను రిలీవ్ చేయకుండా మూడు నెలల పాటు జిల్లాపరిషత్ కార్యాలయంలో జీతం చెల్లించారు. తాజాగా శుక్రవారం ఈయన్ను గత ఉత్తర్వులు అమలు చేశామని చెప్పుకొనేందుకు సరుబుజ్జిలిలో నియమిస్తూ రిలీవ్ చేసేశారు. ప్రస్తుతం బదిలీలపై ఆంక్షలు ఉన్నప్పుడు ఇది ఎలా సాధ్యమైందన్నది అంతుచిక్కడం లేదు. అలాగే ఎవరినైనా బదిలీ చేస్తే వారం రోజుల్లోగా రిలీవ్ కావల్సి ఉంటుంది. అలా కాకుంటే బదిలీ ఉత్తర్వులు ఆటోమేటిక్‌గా రద్దవుతాయి. ఇటువంటి సందర్భాల్లో సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకునే వీలుంది. ప్రస్తుతం ప్రకాష్‌ను సరుబుజ్జిలికి బదిలీ చేయడం, ఆయన అక్కడ విధుల్లో చేరడంతో ప్రభుత్వ ఆంక్షల మేరకు ఈయనకు జీతం చెల్లించేందుకు ట్రెజరీ అధికారులు అభ్యంతరం చెప్పే అవకాశముంది. అలాగే కుప్పిలి గీత సరుబుజ్జిలిలో రిలీవ్ అయినా మూడు నెలలపాటు ఎక్కడా విధుల్లో చేరనందున ఆమెకు జీతాలు చెల్లింపు అంశాన్ని రాష్ట్ర అధికారులకు నివేదించాల్సి ఉంటుంది. ఈమెకు ఇప్పటికీ పోస్టింగ్ ఇవ్వక పోగా ఫారన్ సర్వీసెస్ కింద శ్రీకాకుళం పట్టణంలోని ఏదైనా వేరొక శాఖ కార్యాలయంలో నియమిస్తామని హామీ ఇస్తూ జెడ్పీ అధికారులు కాలయాపన చేస్తున్నట్టు భోగట్టా. దీని వల్ల జీతం, సర్వీసు విషయంలో గీత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. అయినా అధికారులు, వారిపై ఒత్తిడి తెస్తున్న ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే జెడ్పీలో పనిచేస్తున్న మరో జూనియర్ అసిస్టెంట్‌ను గత స్థానంలో పనిచేస్తున్నట్లుగా చూపించి అక్కడే జీతం చెల్లిస్తూ.. జెడ్పీ కార్యాలయంలో అనధికారికంగా డిప్యుటేషన్‌పై పనిచేయించాలని జెడ్పీ అధికారులు నిర్ణయించినట్టు సమాచారం. ప్రజాప్రతినిధుల చుట్టూ ఉండే సిబ్బంది సూచనల మేరకే అధికారులు ఇటువంటి నిర్ణయాలతో గందరగోళం సృష్టిస్తున్నారని జెడ్పీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని జెడ్పీ సీఈవో వసంతరావు వద్ద ఁసాక్షిరూ. ప్రస్తావించగా తాజాగా ప్రకాష్ అనే ఉద్యోగిని బదిలీ చేయడం నిజమేనన్నారు. గీత అనే ఉద్యోగికి సెట్శ్రీలో పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉందని కూడా వెల్లడించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకే ఇటువంటి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.