
సమావేశమైన పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘ నాయకులు
ఒంగోలు టూటౌన్ : జిల్లా పరిషత్ సీఈఓ టి. కైలాష్ గిరీశ్వర్‌ని పనోడు అని మిగిలిన ఉద్యోగులను చిన్న పనోళ్లని జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు సంబోధించడం దురదృష్టకరమని ఎంపీడీఓ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ బి. సాయికుమారి, మినిస్టీరియల్ స్టాఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాసకుమార్, పంచాయతీ కార్యదర్శిల అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ రామోహన్, పీఆర్ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్ వై. పోలయ్య (పాల్‌రాజ్), ఈఓఆర్‌డీల అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజశేఖర్ తదితరులు గురువారం తీవ్రంగా ఖండించారు.
18వ తేదీ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జరిగిన ఈ సంఘటన అందరినీ బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులంతా ప్రజలకు జవాబుదారీ తనంగా ఉండాలే కానీ ఒకరికి ఒకరు జవాబుదారీ తనం కాదని చెప్పారు. జరిగిన సంఘటనను పంచాయతీ రాజ్ డిపార్టుమెంట్ తరఫున అన్ని అసోషియేషన్లు తీవ్రంగా ఖండిస్తున్నాయని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment