సాక్షి, గద్వాల : రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం తప్ప ఇంకెవరు బాగుపడలేదని బీజేపీ మహిళా నేత డీకే అరుణ విమర్శించారు. గడిచిన ఆర్నెళ్లలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీలకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని గుర్తుచేశారు. అంతేగాక నిధుల విషయంలో సర్పంచ్‌కు, ఉప సర్పంచ్‌కు మధ్య కావాలనే గొడవలు సృష్టిస్తున్నారని వెల్లడించారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్న కేసీఆర్‌కు ప్రజలు గుణపాఠం చెప్పే సమయం తప్పకుండా వస్తుందని ఘాటుగా స్పందించారు.కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సర్పంచ్ హక్కులను కాపాడుతామని హామీ ఇచ్చారు.
తలా తోక లేని పార్టీగా కాంగ్రెస్ మారిందని, కనీసం వారి నాయకులను కాపాడుకునే పరిస్థితిలో కాంగ్రెస్ అధిష్టానం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇతర పార్టీలకు చెందిన చాలా మంది నాయకులు బీజేపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. 2023 కల్లా రాష్ట్రంలో బీజేపీ బలమైన శక్తిగా అవతరించనుందని డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment