సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సర్కార్ వ్యవహారశైలి చూస్తుంటే మాజీ సీఎం కేసీఆర్‌ను కాపాడాలని చూస్తున్నట్టు అనుమానం కలుగుతోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. దేశంలోనే అతిపెద్ద కుంభ కోణం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం జ్యుడీషి యల్ ఎంక్వైరీతో కాలయాపన చేయాలని చూస్తోందని పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్ సర్కార్ కాళేశ్వరం రీడిజైన్ పేరుతో ఉద్దేశపూర్వకంగా ప్రాజెక్ట్ వ్యయా న్ని సుమారు రూ.63 వేల కోట్ల నుంచి రూ.1.50 లక్షల కోట్లకు అంచనాలుపెంచి.. వేలకోట్ల అవినీ తికి పాల్పడిందన్నారు. ఆదివారం అరుణ మీడి యాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించడం కంటే సీబీఐ దర్యాప్తు జరి పిస్తే నిజానిజాలు బయటపడతాయన్నారు. కాళేశ్వరం అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు లేఖ రాయలేదో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment