
సాక్షి, గద్వాల అర్బన్: హైదరాబాద్‌లో ఈ నెల 11న ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల ఐక్యవేదిక నిర్వహించిన ధర్మాగ్రహ సభతో అన్ని రాజకీయ పార్టీల్లో కదలిక వచ్చిందని ఎస్‌టీయూ టీఎస్ రాష్ట్ర పరిశీలకులు పర్వత్‌రెడ్డి తెలిపారు.
ఆదివారం ఎస్‌టీయూ టీఎస్ జిల్లా కౌన్సిల్ సమావేశం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా అధ్యక్షుడు యూనిస్ పాషా ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన పర్వత్‌రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు.
ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్న సమయంలో ధర్మాగ్రహ సభ ఎందుకని ప్రశ్నించిన వారికి రాజకీయ పార్టీలు సీపీఎస్, ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై స్పందించిన తీరే వారడిగిన ప్రశ్నలకు సమాధానమన్నారు.
సీపీఎస్ విధానం వెంటనే రద్ద చేసి ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేయాలన్నారు. అదేవిధంగా పాఠశాలల్లో మౌలిక వసతులు పెంచాలన్నారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, విజయభాస్కర్‌రెడ్డి, చెన్నకేశవులు, శ్రీహరి, పాషా, మల్లయ్య, నాగరాజు, రాజన్న, గౌరిశంకర్ పాల్గొన్నారు.