రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలంటే పేరు ఎంచుకుంటేనే సరిపోదు. ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా పార్టీ కర్తవ్యాలు, ఉద్దేశాలు, విధివిధానాలను రూపొందించుకోవాలి. రిజిస్ట్రేషన్ నుంచి గుర్తింపు పొందే వరకు ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉండాలి. ఆయా ఎన్నికల్లో లభించిన ఓట్ల ఆధారంగా జాతీయ, రాష్ట్ర స్థాయి గుర్తింపు వస్తుంది. తగినన్ని ఓట్లు రాకుంటే కేవలం రిజిస్టర్డ్ పార్టీలు గానే పరిగణిస్తారు. గుర్తింపు, రిజిస్ట్రేషనే కాదు.. పార్టీ నిర్వహణ కూడా చాలా కష్టం. పార్టీ రాజ్యాంగం, మేనిఫెస్టో, కార్యవర్గ సమావేశాలు, ఎన్నికల్లో పోటీ, కార్యాలయాల ఏర్పాటు వంటివి క్రమం తప్పకుండా జరగాల్సిందే. ఎక్కడ తేడా వచ్చినా ఎన్నికల సంఘం గుర్తిం పును రద్దు చేసే అవకాశాలు లేకపోలేదు. అయినా, ఈసారి ఎన్నికల్లో 84 పార్టీలు బరిలో దిగాయి. నామినేషన్ల గడువు ఉపసంహరణ పూర్తయ్యాక ఎన్నికల సంఘం అధికారికంగా ఇచ్చిన వివరాల లెక్క ఇది.
గోండుల రాష్ట్రం కోసం..
గోండులకు ప్రత్యేక రాష్ట్రం సాధించాలనే ధ్యేయంతో 1991లో గోండ్‌వాణా గణతంత్ర పార్టీ (జీజీపీ) ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయం ఛత్తీస్‌గఢ్‌లో ఉంది. ఊదారంగు జెండా కలిగిన ఈ పార్టీ ఎన్నికల గుర్తు రంపం. ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, బిహార్, మహారాష్ట్రల్లో పలు ఎన్నికల్లో పోటీచేసింది. గోండు జా తికి చెందిన ఆదివాసీల హక్కుల కోసం పోరాడటం, మధ్యభారతంలో వీరికి ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటు చేయిం చడమే ఈ పార్టీ ఎజెండా. ఈ పార్టీ తెలంగాణలోని ఆదిలాబాద్, అశ్వారావుపేట స్థానాల్లో బరిలో ఉంది.
బోస్ దళం ఇది..
నేతాజీ సుభాశ్ చంద్రబోస్.. 1939లో కాంగ్రెస్‌తో విభేదించి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఏర్పాటు చేశారు. టూవర్డ్స్ సోషలిజం, జనజాగరణ్, లోక్‌మత్ అనే పత్రికలను కూడా నడిపిస్తున్న ఈ పార్టీ ప్రస్తుతం పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో ఇద్దరు సభ్యులను కలిగి ఉంది. మన రాష్ట్రంలో ప్రధాన పార్టీల తరఫున టికెట్లు ఆశించి భంగపడిన ముగ్గురు నేతలు ఈ పార్టీ నుంచి బరిలో ఉన్నారు.
ధ్యాన సంగమం..పిరమిడ్ పార్టీ
పత్రీజీగా గుర్తింపు పొందిన ధ్యానగురువు 1999లో ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఈ పార్టీని స్థాపించారు. దేశంలోని ప్రజలందరినీ ధ్యానజీవులుగా, శాకాహారులుగా, ప్రేమను కాంక్షించే వారిగా మార్చాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పార్టీ ఇది. ప్రస్తుత ఎన్నికలలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
ఇంకా పోటీలో ఉన్న పార్టీలివే..
ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్, బీజేపీ, సీపీఎం, బీఎల్‌పీ, శివసేన, ఎన్‌సీపీ, ఆమ్‌ఆద్మీ, సమాజ్‌వాదీ, బీఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్, ఎంసీపీఐ (యునైటెడ్), ఎస్‌యూసీఐ (కమ్యూనిస్టు), లోక్‌సత్తా, ఎంబీటీ, ఎంఐఎం, సీపీఐ (ఎంఎల్) పార్టీలు కాక ఈసారి పోటీలో ఉన్న పార్టీ లివి.. అంబేద్కరైట్ పార్టీ ఆఫ్ ఇండియా, పిరమిడ్ పార్టీ, బహుజన ముక్త్ పార్టీ, పీపుల్స్ రిపబ్లికన్ పార్టీ, నవ ప్రజారాజ్యం పార్టీ, న్యూ ఇండియా పార్టీ, ఇండియన్ ప్రజాబంధు పార్టీ, భారతీయ బహుజన క్రాంతిదళ్, బహుజన రాజ్యం పార్టీ (పూలే–అంబేద్కర్), ప్రేంజనతాదళ్ పార్టీ, తెలంగాణ ప్రజాపార్టీ, రాజ్యాధికార పార్టీ, గోండ్‌వాణా గణతంత్ర పార్టీ, అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ ఫార్వర్డ్ బ్లాక్, ఆలిండియా జైహింద్ పార్టీ, బహుజన రాష్ట్ర సమితి, నయాభారత్ పార్టీ, జై స్వరాజ్ పార్టీ, తెలంగాణ ప్రజల పార్టీ, తెలంగాణ కార్మికరైతు రాజ్యం పార్టీ, దళిత బహుజన పార్టీ, బహుజన లెఫ్ట్ పార్టీ, అఖిల భారతీయ దేశభక్త్ మోర్చా, జై మహాభారత్ పార్టీ, అఖిల భారతీయ జనసంఘ్, తెలంగాణ ఇంటి పార్టీ, ఆలిండియా సమతా పార్టీ, శ్రమజీవి పార్టీ, మన పార్టీ, ఆర్‌పీఐ (ఏ), ఆర్‌పీఐ (కే), నవసమాజ్ పార్టీ, అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రజాసత్తా పార్టీ, జనవాహిని పార్టీ, స్వర్ణభారత్ పార్టీ, ప్రజాస్వరాజ్ పార్టీ, అనారక్షిత్ సమాజ్ పార్టీ, ఇండియా ప్రజయబంధు పార్టీ, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి, ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ, ద ఫ్యూచర్ ఇండియా పార్టీ, సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా, జాతీయ మహిళా పార్టీ, తెలంగాణ లేబర్ పార్టీ, జై భారత్ జనసేన పార్టీ, లోక్‌తాంత్రిక్ సార్వజన సమాజ్ పార్టీ, యువపార్టీ, హిందూ ఏక్తా ఆందోళన్ పార్టీ, భారతీయ రిపబ్లికన్ పక్ష, నవభారత్ నేషనల్ పార్టీ, మజ్లిస్ మర్కజ్–ఏ–సియాసీ పార్టీ, అఖిల భారత ముస్లిం లీగ్ సెక్యులర్, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా, డెమొక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా, నేషనల్ యూత్ పార్టీ, నవోదయం పార్టీ, యువ తెలంగాణ పార్టీ, ఏకీకృత సంక్షేమ రాష్ట్రీయ ప్రజా పార్టీ, బహుజన రాష్ట్ర సమితి, తెలంగాణ ప్రజాసమితి, తెలంగాణ ప్రగతి సమితి.
..:: మేకల కల్యాణ్ చక్రవర్తి
చిన్న పార్టీల పెద్ద పోటీ
Published Thu, Dec 6 2018 5:40 AM | Last Updated on Thu, Dec 6 2018 5:40 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment