సాక్షి, కోస్గి (కొడంగల్) : సువిధతో అంతా సుగమం. అసెంబ్లీ ఎన్నికల్లో వాహనాలు, సభలు సమావేశాల అనుమతులకు నేతలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కొత్తగా ఎన్నికల కమిషన్ తీసుకొచ్చిన సువిధ పోర్టల్‌తో ఇక అన్ని అనుమతులు సుగమంగా రానున్నాయి. అనుమతుల కోసం రిటర్నింగ్ అధికా రికి నేరుగా దరఖాస్తు ఇచ్చినా, సువిధ పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే చాలు. ఇక అంతా అధికారులే చూసుకుంటారు.
24 గంటల్లో అనుమతులు ఇచ్చేస్తారు. 2018 అసెంబ్లీ ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ సువిధ పోర్టల్‌ను కొత్తగా అమలు చేస్తోంది. ఈ పోర్టల్‌ద్వారా రాజ కీయ పార్టీలు, వాహనాల అనుమతులు, ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఇతర 9రకాల అనుమతులను ఇందులోనే తీసుకునేందుకు వీలు కల్పించింది. గతంలో ఒక వాహన అనుమతి పొందాలంటే అభ్యర్థులు నాలుగైదురకాల ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది.
సువిధ దరఖాస్తు ఇస్తే చాలు..అన్ని అనుమతులు ఒకే చోట అధికారులు ఉండి పరిష్కరించి అనుమతి కాగితం చేతుల్లో పెట్టే విధంగా ఎన్నికల కమిషన్ కొత్త విధానానికి రూపకల్పన చేసి అమలు చేసింది. అందులో భాగంగా జిల్లా వ్యా ప్తంగా ఆరు నియోజకవర్గాల పరిధిలో అన్ని అనుమతులు ఆ విధంగానే పొందుతున్నారు.
డీఈఓ అనుమతి తప్పనిసరి
అభ్యర్థి, ఇతర రాజకీయ పార్టీ నాయకులు కానీ ప్రచారానికి సంబంధించి అనుమతి తీసుకున్న నియోజకవర్గానికి కాకుండా ఇతర నియోజకవర్గాల్లో వాహనం తిరగాలంటే జిల్లా ఎన్నికల అధికారి నుంచి అనుమతి తీసుకోవాలి. రిటర్నింగ్ అధికారి ఇచ్చే అనుమతి నియోజకవర్గ పరిధిలోనే ఉంటుంది. ఇప్పటివరకు ఇలా ఉమ్మడి జిల్లాలోని వివిధ పార్టీల నుంచి ఎన్నికల బరిలోకి దిగిన పలువురు అభ్యర్థులు అనుమతులు పొందారు.
అధికారులందరూ ఒకే చోట..
సువిధ యాప్‌లో అనుమతి పొందేం దుకు సంబంధించిన అధికారులంతా ఒకే చోట ఉంటారు. ఆర్‌టీఏ, ఫైర్, ఆర్‌అండ్‌బీ, పోలీస్ శాఖలకు సంబంధించిన వారు అక్కడే ఉండి వాటిని వెంటనే పరిష్కరించి వాటిని సంబంధిత అధికారులకు పంపిస్తారు. వారు 24గంటల్లోగా అనుమతి ఇస్తారు.
రాజకీయ ప్రతినిధులు లేదా ఏ సాధారణ పౌరుడైనా దరఖాస్తును నేరుగా టర్నింగ్ అధికారికి, లేదా ఆన్‌లైన్‌లో పూర్తి చేసి సడ్మిట్ చేస్తే చాలు. అనుమతుల కోసం మిగిలిన పని సంబంధిత ఎన్నికల అధికారి చూసుకుంటారు.
‘సువిధ’లో అనుమతులు...
- సాధారణ దరఖాస్తులు
- మీటింగ్‌లు, లౌడ్ స్పీకర్ల కోసం
- తాత్కాలిక ప్రాంతాయ
- కార్యాలయాల కోసం
- పార్టీల వాహనాల
- అనుమతుల కోసం
- పార్టీలు నిర్వహించిచే ర్యాలీలు, లౌడ్‌స్పీకర్ల అనుమతి
- కూడలి లేదా చౌరస్తాల్లో పార్టీలు
- నిర్వహించే సమావేశాలు,
- లౌడ్‌స్పీకర్ల అనుమతి
- హెలీకాప్టర్, హెలీపాడ్ అనుమతి
- డయాస్, భారీ కేడ్ల నిర్మాణం అనుమతి
- పార్టీల వాహనాల అనుమతి కోసం..
Comments
Please login to add a commentAdd a comment