సాక్షి, జడ్చర్ల టౌన్ /కల్వకుర్తి టౌన్ : పోలింగ్‌లో భాగంగా ఓటు వేశాక అక్కడి అధికారులు ఓటరు ఎడమచేతి చూపుడు వేలుకు సిరా గుర్తు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. రెండో సారి ఓటు వేసేందుకు వీలు లేకుండా ఈ గుర్తు పెడతారు.
అయితే, చూపుడు వేలు లేకపోతే ఎలా అనే సందేహం తలెత్తవచ్చు. అయితే, దీనికి ఎన్నికల సంఘం ప్రత్యామ్నాయ మార్గాలను నిర్దేశించింది. చూపుడు వేలు లేకపోతే ఎడమ చేతి మధ్య వేలుకు సిరా గుర్తు వేయొచ్చు. ఆ వేలు కూడా లేకపోతే ఉంగరపు వేలుకు, పై నాలుగు వేళ్లు లేకుంటే చిటికన వేలుకు సిరా వేస్తారు.
ఇక ఎడమ చేయి లేని వారికి కుడిచేయి చూపుడు వేలుకు, ఆ వేలు లేకుంటే మద్యవేలు, ఉంగరపు వేలు, చిటికెన వేలుకు సిరా గుర్తు వేస్తుంటారు. అయితే, రెండు చేతులకు వేళ్లు లేనట్లయితే వేళ్ల మొదలు, మధ్యభాగంలో సిరా వేస్తారు. అసలు చేతులే లేని వారికైతే ఎడమ చెంపకు సిరా గుర్తు పెట్టాలని ఎన్నికల కమిషన్ నిర్దేశించింది.
ఓటు... బ్రహ్మాస్త్రం
తమ సిద్ధాంతాలతో విధి విధానాలతో జనాన్ని ఆకట్టుకునే వాళ్లొకరు... ప్రజా పనులు చేస్తామని, ప్రాజెక్టులు కడతామని, నీవు బతికి ఉన్నంత వరకు భృతి కల్పిస్తామని హామీలిచ్చేవారు ఇంకొకరు... రోడ్లు, డ్రెయినేజీలు, బళ్లు, ఇళ్లు నిర్మిస్తామని ఆకర్షించేవాళ్లు మరొకరు...రంగు రంగుల హామీల రంగును
తేల్చాల్సింది ఈ ఓటుతోనే బియ్యం పథకాలకు, బిచ్చం పథకాలకు, ఉచిత హామీలకు, నీ ఓటు వేస్తే భవిష్యత్ తరాలు బానిసలుగా బతికాల్సిందేనా? సోమరితనంతో.. దేశం మీద పడి తిరగాల్సిందేనా? ఓటు నీదైనప్పుడు.. ఆ గద్దెపై కూచునే సీటు నీదెందుకు కాకుడదు? ఎన్నాళ్లిలా? గడీలపాలకుల నయవంచనలో నలిగిపోయేది... సమయం లేదు మిత్రమా.. ప్రజాసేవకుడవై నీ రథాన్ని ప్రజాపథం వైపు కదిలించు
ఓటు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించు.. ఈ సమరంలో విజయాన్ని సాధించు సుస్థిర పాలనవైపు పయనించు..
Comments
Please login to add a commentAdd a comment