నాగార్జునసాగర్/దోమలపెంట (అచ్చంపేట)/గద్వాల రూరల్: శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు ఎగువ నుంచి వరద భారీగా పెరిగింది. సోమవారం జూరాలలో స్పిల్‌వే ద్వారా 68,850, విద్యుదుత్పత్తి ద్వారా 39,092, సుంకేసుల నుంచి 90,222, హంద్రీ నుంచి 4,905 మొత్తం 2,03,069 క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతోంది. దీంతో విద్యుదుత్పత్తి ద్వారా 62,112క్యూసెక్కులు, పది గేట్లు 15 మీటర్ల మేర ఎత్తి మొత్తం 4,37,792 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్ 22 గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు
శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం నీటిమట్టం 884.2 అడుగులు, 210.9946 టీఎంసీల నీటి నిల్వ ఉంది. మరోపక్క శ్రీశైలం నుంచి వస్తున్న వరదతో సాగర్ పోటెత్తుతోంది. దీంతో 22 రేడియల్ క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా, కుడి, ఎడమ కాల్వలతో పాటు వరదకాల్వ, ఏఎమ్మార్పీకి 20,589 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు జూరాలకు 1.16లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా..17 గేట్లు ఎత్తి స్పిల్‌వే ద్వారా 68,850 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 39,092 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment