గద్వాలలో కాంగ్రెస్‌కు షాక్‌.. బీఆర్‌ఎస్‌లో చేరిన డీసీసీ అధ్యక్షుడు | Gadwal DCC Chairman Prabhakar Reddy Resign For Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు షాక్‌.. గద్వాల జిల్లా అధ్యక్షుడు, ఉప్పల్‌ ఇంచార్జి రాజీనామా

Published Wed, Oct 18 2023 3:33 PM | Last Updated on Wed, Oct 18 2023 7:49 PM

Gadwal DCC Chairman Prabhakar Reddy  Resign For Congress - Sakshi

సాక్షి, జోగులాంబ గద్వాల: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ తగిలింది. కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు నేతలు పార్టీని వీడారు. గద్వాల జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. గద్వాల నుంచి ఎమ్మెల్యే టికెట్‌కెట్‌ దక్కలేదన్న అసంతృప్తితో ప్రభాకర్‌ రెడ్డి ఆ పార్టీకి  గుడ్‌బై చెప్పారు. అనంతరం మంత్రి హరీష్‌ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 

ఈ సందర్బంగా ప్రభాకర్‌ రెడ్డి టీపీసీసీ రేవంత్‌ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. గద్వాల కాంగ్రెస్‌ టికెట్‌ను రేవంత్‌ కొత్తగా వలస వచ్చిన జడ్పీ చైర్‌ పర్సన్‌ సరితకు అమ్ముకున్నారని విమర్శించారు. గద్వాలలో రేవంత్‌ రెడ్డి బ్యానర్‌ను ప్రభాకర్‌ రెడ్డి అనుచరులు దగ్ధం చేశారు. ఇప్పటికే సరిత అభ్యర్థిత్వాన్ని అటు కాంగ్రెస్‌ అసమ్మతి నేతలు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

ఉప్పల్‌కు చెందిన సీనియర్‌ కాంగ్రెస్ నేత, ఉప్పల్‌ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి రాగిడి లక్ష్మారెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. తనకు గౌరవం లేని పార్టీలో ఉండకూడదని నిర్ణయించుకన్న లక్ష్మారెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. సాయంత్రం ప్రగతి భవన్‌కు వెళ్లి బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ను కలువనున్నారు. అనంతరం కేసీఆర్‌ సమక్షంలో  బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నారు.
చదవండి: మహబూబ్‌నగర్‌ నా గుండెల్లో ఉంటుంది: సీఎం కేసీఆర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement