సారొస్తే మటన్‌ బిర్యానీ తినిపించాల్సిందే..! | Narayanpet Additional DRDO is involved in corruption and irregularities | Sakshi
Sakshi News home page

సారొస్తే మటన్‌ బిర్యానీ తినిపించాల్సిందే.. లేదంటే టార్చర్ తట్టుకోలేవు

Published Thu, Apr 3 2025 1:55 PM | Last Updated on Thu, Apr 3 2025 5:47 PM

Narayanpet Additional DRDO is involved in corruption and irregularities

లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అడిషనల్‌ డీఆర్‌డీఓ

చట్ట, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ విన్నపం 

ఆందోళనలో ఉద్యోగులు

 

నారాయణపేట: సెర్ప్‌ మహిళా ఉద్యోగులు అడిషనల్‌ డీఆర్‌డీఓ అంటేనే హడలెత్తిపోతున్నారు. లైంగికంగా వేధిస్తూ మానసిక క్షోభకు గురిచేస్తున్నాడు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న నారాయణపేట జిల్లా అడిషనల్‌ డీఆర్‌డీఓపై చట్ట, శాఖాపరమైన చర్యలు చేపట్టాలని బుధవారం సెర్ప్‌ ఉద్యోగులు డీఆర్‌డీఓ మొగులప్పకు విన్నవించడంతో జిల్లా అంతటా చర్చానీయాంశంగా మారింది. జిల్లాలో సెర్ప్‌ సంస్థకు, సిబ్బందికి చెడ్డపేరు తెస్తూ సంస్థ పరువు తీస్తున్నాడంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వామ్మో ఇంత మాట అన్నాడా..
సెర్ప్‌ ఉద్యోగుల గ్రీవెన్స్‌ సరిచేయుటకు సీఈఓ సెర్ప్‌ సైట్‌లో తప్పులుగా ఉన్న ఉద్యోగుల సమా చారాన్ని సరిచేయుటకు జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటుచేసి అట్టి తప్పులను ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌ తనిఖీ చేసి మార్చి15 నాటికి కలెక్టర్‌ అప్రూవల్‌ తీసుకొని సెర్ప్‌ పంపాల్సి ఉంది. అందుకు సంబంధించిన ఫైల్‌ను సంబంధిత అధికారులు మార్చి 29వ తేదీ మధ్యాహ్నం అడిషనల్‌ డీఆర్‌డీఓ దగ్గరకు తీసుకుపోగా( మూడు రోజులు వరుస సెలవులు రావడంతో) వారిని అసభ్య పదజాలంతో దూషించడంతో డీఆర్‌డీఓ ముందు డీపీఎంలు చెప్పారు. సదరు అధికారి వామ్మో అంత మాట అన్నాడా అంటూ ఆరా తీశారు. అందుకు అవమానంగా భావించిన సంబంధిత అధికారులు ఏమి మాట్లాడలేక వెనుదిరిగినట్లు వివరించారు. ఇలాంటి మాట్లాడరాదు.. కానీ ఇలా మాట్లాడితే చర్యలు తప్పవని డీఆర్‌డీఓ చెప్పుకొచ్చారు.

నారాయణపేట జిల్లాకు రాకముందు..
అడిషనల్‌ డీఆర్‌డీఓ నారాయణపేట జిల్లాకు రాకముందు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పని చేశారు. ఆ సమయంలో జిల్లాలోని మహిళా ఉద్యోగులను లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురిచేశాడు. అక్కడి ఉద్యోగులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. ఇలాంటి వ్యక్తి సెర్ప్‌ సంస్థలోనే ఉండకూడదని విధుల నుంచి తొలగిద్దామని నిర్ణయం తీసుకోగా, భార్యాబిడ్డలను అడ్డు పెట్టుకొని ఒకటిన్నర సంవత్సరం పాటు సస్పెన్షన్‌లో ఉన్నాడు. తర్వాత నారాయణ పేట జిల్లాకి బదిలీ అయ్యాడు. ఇక్కడ కూడా అదే తీరులో వ్యవహరిస్తున్నాడు.

దినదిన గండంగా..
జిల్లాలోని స్వశక్తి మహిళలు, మహిళా ఉద్యోగులు మానసికంగా ఇబ్బందులకు గురవుతూ దినదిన గండంగా కాలం వెల్లదీస్తున్నారు. సార్ మండలా నికి వస్తే చికెన్, మటన్ బిర్యానీ తినిపించాల్సిందే. లేదంటే వేధింపులు తప్పవు. సారూ టార్చర్ తట్టుకోలేక ఓ ఉద్యోగి సైతం అనారోగ్యంతో మానసిక క్షోభతో చనిపోయాడు. జిల్లాకు వచ్చిన

నాటి నుంచి వెహికిల్ వాడకుండా డీపీఎంల వెహి కల్ వాడుతూ అక్రమంగా నెలకు రూ.33 వేలు డబ్బులు కాజేస్తున్నట్లు పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. మహిళా ఉద్యోగుల్ని లైంగికం గా, మానసికంగా వేధిస్తున్న అతడిపై చట్టరీత్యా
చర్యలు తీసుకోవాలని మహిళా ఉద్యోగులు వేడు కుంటున్నారు. కార్యక్రమంలో జిల్లాలోని అన్ని క్యాడర్ల ఉద్యోగులు, డీపీఎంఈలు మాసన్న, ఆనందం, జయన్నలతో పాటు జాక్ నాయకులు నారాయణ, ఎల్1, ఎల్2 యూనియన్ నాయకులు సందప్ప, గంగాధర్, సుమతి, శ్రీనివాస్ తోపాటుగా ఇతర సిబ్బంది హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement