రోజువారీ రవాణా ఖర్చులు పెరుగుతుండటంతో ఈ యువ రైతు కొత్తగా ఆలోచించాడు. వనపర్తి జిల్లా అమరచింత మండలం నాగల్‌కడ్మూర్‌కు చెందిన జానకి రాంరెడ్డి తమకున్న ఆరెకరాల పొలంలో బొప్పాయి తోటను సాగు చేశాడు. ఈ పండ్లను అమ్మడానికి అమరచింత, ఆత్మకూర్‌కు రావడానికి ఆటోకు రోజుకు రూ.600 చెల్లించేవాడు. ఇది భారంగా మారింది. అతను స్వతహాగా బైక్ మెకానిక్ కావడంతో దాన్నుంచి బయటపడే ఆలోచన చేశాడు. స్కూటర్‌కు ట్రాలీని జతపరిచాడు. తన భార్యతో కలిసి బొప్పాయిలను విక్రయిస్తున్నాడు.
– అమరచింత
పరుగో పరుగు
జోగుళాంబ గద్వాల జిల్లా గట్టులో భవానీమాత జాతర సందర్భంగా ఆదివారం నిర్వహించిన శునకాల పరుగుపందెం పోటీలు ఆకట్టుకున్నాయి. మొదటి బహుమతిని గద్వాలకు చెందిన శునకం దక్కించుకుంది.
– గద్వాల (గట్టు)
చిలుకమ్మ పలికింది..
విజయవాడ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ గ్రౌండ్స్‌లో ఆదివారం నిర్వహించిన డాగ్ షోలో రెండు చిలుకలు సందడి చేశాయి. ఆస్ట్రేలియా నుంచి తెచ్చిన తోకటూ(తెల్ల రంగులో ఉన్నది), అమెరికా నుంచి తెచ్చిన మకావ్ చిలుకలు సందర్శకుల మాటలకు బదులిస్తూ వారిని ఆశ్చర్యచకితులను చేశాయి. దీంతో డాగ్‌షోకు వచ్చిన పలువురు ఈ చిలుకలతో సరదాగా మాట కలిపి ఆనందంలో మునిగితేలారు.
– సాక్షి, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment