సాక్షి, ధరూరు (గద్వాల) : నెట్టెంపాడు ప్రధాన కాల్వలోకి ఎద్దుల బండితో సహా దూసుకెళ్లిన సంఘటన మండలంలోని మన్నాపురం శివారులో చో టుచేసుకుంది. వివరాలిలా.. గ్రామానికి చెందిన కుర్వ తిమ్మన్న శనివారం ఉదయం ఎద్దులతో బండిని వ్యవసాయ పొలానికి తీసుకెళ్లి.. సా యంత్రం ఎద్దుల బండితో ఇంటికి తిరుగుపయాణమయ్యాడు. అయితే గ్రామ సమీపంలో ఓ రైతు కాల్వ వద్ద విద్యుత్ మోటార్‌ను ఆన్ చేసి మట్టి దిబ్బ పక్క నుంచి సడన్‌గా లేచాడు. దీం తో కాల్వ పక్కనే వెళ్తున్న ఎద్దులు ఒక్కసారిగా బెదిరిపోయి.. నెట్టెంపాడు ప్రధాన కాల్వలోకి దూసుకెళ్లాయి.
కాల్వలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రైతు కుర్వ తిమ్మన్న ప్రాణాల ను కాపాడుకుని బయటకు రాగా.. ఎద్దులబండి కట్టి ఉండటంతో ఎద్దులు మృత్యువాత పడ్డా యి. ఈ విషయమై రైతులు వెంటనే ఘటనా స్థలానికి అర కిలో మీటర్ దూరంలో ఉన్న పంప్‌హౌస్ వద్దకు వెళ్లి పంపులను ఆఫ్ చే యాలని కోరగా అక్కడి అధికారులు రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు చెబితేనే బంద్ చేస్తామని చెప్పారు. రెవెన్యూ శాఖ అధికారులు స్పందించకపోవ డంతో ఈ విషయాన్ని రేవులపల్లి పోలీసులు, ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డిలకు సమాచారం ఇవ్వడంతో వారు గుడ్డెందొడ్డి లిఫ్టు–1కు ఫోన్ చేసి నీటి పంపింగ్‌ను బంద్ చేయించారు. ట్రెయినీ ఎస్‌ఐ సందీప్‌రెడ్డి, ఏఎస్‌ఐ వెంకటేష్‌గౌడ్ అక్కడికి వచ్చి ఎద్దులు, బండిని తాళ్లతో కట్టి బయటకు తీశారు. అయితే మూడు నెలల క్రితమే పెబ్బేరు సంతలో ఎద్దులను రూ.80 వేలకు కొనుగోలు చేశామని బాధిత కుటుంబ సభ్యులు రోదించారు. బాధిత కుటుంబానికి పరిహారం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment