Nettempadu
-
పాపం ఎద్దులు బెదరడంతో..
సాక్షి, ధరూరు (గద్వాల) : నెట్టెంపాడు ప్రధాన కాల్వలోకి ఎద్దుల బండితో సహా దూసుకెళ్లిన సంఘటన మండలంలోని మన్నాపురం శివారులో చో టుచేసుకుంది. వివరాలిలా.. గ్రామానికి చెందిన కుర్వ తిమ్మన్న శనివారం ఉదయం ఎద్దులతో బండిని వ్యవసాయ పొలానికి తీసుకెళ్లి.. సా యంత్రం ఎద్దుల బండితో ఇంటికి తిరుగుపయాణమయ్యాడు. అయితే గ్రామ సమీపంలో ఓ రైతు కాల్వ వద్ద విద్యుత్ మోటార్‌ను ఆన్ చేసి మట్టి దిబ్బ పక్క నుంచి సడన్‌గా లేచాడు. దీం తో కాల్వ పక్కనే వెళ్తున్న ఎద్దులు ఒక్కసారిగా బెదిరిపోయి.. నెట్టెంపాడు ప్రధాన కాల్వలోకి దూసుకెళ్లాయి. కాల్వలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రైతు కుర్వ తిమ్మన్న ప్రాణాల ను కాపాడుకుని బయటకు రాగా.. ఎద్దులబండి కట్టి ఉండటంతో ఎద్దులు మృత్యువాత పడ్డా యి. ఈ విషయమై రైతులు వెంటనే ఘటనా స్థలానికి అర కిలో మీటర్ దూరంలో ఉన్న పంప్‌హౌస్ వద్దకు వెళ్లి పంపులను ఆఫ్ చే యాలని కోరగా అక్కడి అధికారులు రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు చెబితేనే బంద్ చేస్తామని చెప్పారు. రెవెన్యూ శాఖ అధికారులు స్పందించకపోవ డంతో ఈ విషయాన్ని రేవులపల్లి పోలీసులు, ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డిలకు సమాచారం ఇవ్వడంతో వారు గుడ్డెందొడ్డి లిఫ్టు–1కు ఫోన్ చేసి నీటి పంపింగ్‌ను బంద్ చేయించారు. ట్రెయినీ ఎస్ఐ సందీప్‌రెడ్డి, ఏఎస్ఐ వెంకటేష్‌గౌడ్ అక్కడికి వచ్చి ఎద్దులు, బండిని తాళ్లతో కట్టి బయటకు తీశారు. అయితే మూడు నెలల క్రితమే పెబ్బేరు సంతలో ఎద్దులను రూ.80 వేలకు కొనుగోలు చేశామని బాధిత కుటుంబ సభ్యులు రోదించారు. బాధిత కుటుంబానికి పరిహారం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
ప్రాజెక్టులపై చెరగని సంతకం.. వైఎస్
♦ కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ♦ కోయల్‌సాగర్ ప్రాజెక్టుల పనుల్లో ♦ చాలా భాగం ఆయన హయాంలోనే... సాక్షి, హైదరాబాద్: ఏళ్ల తరబడి బీళ్లుగా ఉండిపోయిన పాలమూరు జిల్లా భూములకు నీరందించి, సస్యశ్యామలం చేయాలన్న మహోన్నత లక్ష్యంతో వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞం ఫలాలు ఇప్పుడు ఆ జిల్లా వాసులకు అందుతున్నాయి. కరువు రక్కసితో అల్లాడుతూ వలసబాట పట్టిన ఆ జిల్లా రైతుల ముఖంపై చిరునవ్వు వెల్లివిరియాలన్న వైఎస్ కలలు నేడు నిజాలవుతున్నాయి. జలయజ్ఞంలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలో కల్వకుర్తి (25 టీఎంసీలు), భీమా (20 టీఎంసీలు), నెట్టెంపాడు (20 టీఎంసీలు) ప్రాజెక్టులను ఆయన హయాంలో చేపట్టారు. 7.8 లక్షల ఎకరాల ఆయకట్టును వృద్ధిలోకి తెచ్చే లక్ష్యంతో రూ.7,969.38 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టులను ప్రారంభించారు. వీటితోపాటు 3.9 టీఎంసీల సామర్థ్యంతో 50 వేల ఎకరాలకు నీరిచ్చేలా కోయల్‌సాగర్ ప్రాజెక్టును చేపట్టారు. నిర్మాణం వేగంగా జరగాలన్న ఉద్దేశంతో భారీగా నిధులు ఇవ్వడంతో శరవేగంగా ఆ ప్రాజెక్టుల పనులు జరిగాయి. సుమారు రూ.5 వేల కోట్లు వైఎస్ హయాంలోనే ఖర్చు చేశారు. వైఎస్ మరణానంతరం కొన్ని అవాంతరాలు వచ్చినా... ప్రస్తుత ఏడాదిలో ఆ పనులన్నీ కొలిక్కి వచ్చాయి. ఈ ప్రాజెక్టుల కింద ఇప్పటివరకు సుమారు 1.5 లక్షల ఎకరాలు వృద్ధిలోకి రాగా.. ఈ ఏడాది పాత ఆయకట్టు కలుపుకొని 4.6 లక్షల ఎకరాలకు నీరందనుంది. ప్రస్తుతం కృష్ణా నుంచి జూరాలను చేరుతున్న వరద మరికొంత కాలం కొనసాగితే నెట్టెంపాడు కింద 1.5 లక్షల ఎకరాలు, కోయల్‌సాగర్ కింద 20 వేల ఎకరాలు, భీమా కింద 1.40 లక్షల ఎకరాలకు నీరందనుండగా... కృష్ణా నీరు శ్రీశైలాన్ని చేరితే కల్వకుర్తి కింద 1.50 లక్షల ఎకరాలకు సాగు నీరందనుంది. ఇన్నాళ్లూ బీడుగా ఉన్న భూములకు వైఎస్ చేపట్టిన ప్రాజెక్టులతో జలాభిషేకం జరుగుతోంది. -
ఆ ప్రాజెక్టులు మా ప్రభుత్వం చేపట్టినవే
టీడీపీ నేత రావుల సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి ప్రాజెక్టులు టీడీపీ హయాం లో చేపట్టినవేనని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు.ఈ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు గతంలో ప్రారంభించిన వాటినే మళ్లీ ప్రారంభిస్తోందని పేర్కొన్నారు. గురువారం మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్రెడ్డితో కలసి ఆయన ఎన్టీఆర్ట్రస్ట్ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ, కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే మోటార్లు బిగించి జాతికి అంకితం చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు కొత్తగా పైలాన్లు నిర్మించి మళ్లీ ప్రారంభిస్తున్నారన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తే 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందివ్వొచ్చని ఎప్పుడో ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు.పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జూరాల నుంచి కాకుండా శ్రీశైలం నుంచి ప్రతిపాదించి అంతర్రాష్ట్ర జల వివాదాల్లోకి లాగారని దయాకర్‌రెడ్డి అన్నారు. -
4 ప్రాజెక్టులకు 11 నుంచి నీటి విడుదల
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలోని 4 ప్రధాన ఎత్తిపోతల ప్రాజెక్టులు.. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ల కింది ఆయకట్టుకు ఈ నెల 11 నుంచి నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూరాల, శ్రీశైలం నుంచి ఈ ఆయకట్టులోని లక్షా 29వేల ఎకరాలకు నీరందించాలని సంకల్పించింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి గతేడాదే 75 శాతం పనులు పూర్తయ్యాయి. అప్పడు కూడా జూరాల, శ్రీశైలం నుంచి నీటి విడుదల జరిగినా, పనులు పూర్తికాకపోవడం వల్ల ఆయకట్టు లక్ష ఎకరాలకు మించలేదు. ఈ ఏడాది కాలంలో మరో 10 శాతం పనులు పూర్తికావడంతో ఆయకట్టు మరో 40 వేల ఎకరాలు పెరగనుందని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు జూరాల ప్రాజెక్టులో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ఒప్పందం మేరకు ఒక వారం కర్ణాటక, మరోవారం తెలంగాణ వాడుకోవాలి. ఈ వారం మొత్తం విద్యుత్‌ను కర్ణాటక వాడుకోగా, సోమవారం నుంచి తెలంగాణ వంతు రానుంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే మొత్తం 120 మెగావాట్ల విద్యుత్‌లో 97 మెగావాట్లను ఎత్తిపోతలకు వాడుకొని ఈ నాలుగు ప్రాజెక్టుల కింది ఆయకట్టుకు నీరు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.