vijayudu
-
తుమ్మిళ్ల లిఫ్టు వద్ద ఉద్రిక్తత
రాజోళి/ శాంతిగనర్: జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలంలోని తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేసే క్రమంలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్కి చెందిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఏఐసీసీ నేత, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మధ్య వివాదం ఏర్పడి పోటాపోటీగా ఆందోళనకు దిగారు. జిల్లాలోని ఆర్డీఎస్ ఆయకట్టుకు నీరందించేందుకు తుంగభద్ర నదిపై నిర్మించిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా ప్రస్తుతం నీరు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ఉదయం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు తుమ్మిళ్లకు వెళ్లి మోటార్లు ఆన్ చేసి, పూజలు చేసేందుకు డీ–23 కెనాల్ వద్దకు వెళ్లారు. అనంతరం ఏఐసీసీ నేత, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ తుమ్మిళ్ల వద్దకు వచ్చారు.అయితే తాను మోటార్ ఆన్ చేసినప్పటికీ కెనాల్లో నీరు విడుదల కాలేదని, దీనికి సంపత్‌కుమారే కారణమని ఎమ్మెల్యే విజయుడు ఆరోపించి, ఆందోళన చేస్తూ బైఠాయించారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఎమ్మెల్యేగా తాను ప్రోటోకాల్ ప్రకారమే నీటిని విడుదల చేసేందుకు వచ్చానని, తాను ఆన్ చేసిన తర్వాత మళ్లీ ఆయన ఏ హోదాలో ఆఫ్ చేస్తారని, వెంటనే సంపత్ కుమార్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నీటిని విడుదల చేసేదాకా అక్కడి నుంచి వెళ్లనని తేలి్చచెప్పారు. పోలీసులు ఎంతసర్ది చెప్పినా వినలేదు.మరోవైపు తుమ్మిళ్ల నుంచి డీ–23కి కాంగ్రెస్ కార్యకర్తలతో బయలుదేరిన సంపత్ కుమార్‌ను పోలీసులు పచ్చర్లలోనే నిలిపేశారు. దీంతో ఆయన పోలీసులపై మండిపడ్డారు. కాగా.. పరిస్థితి చేయి దాటిపోతుందని భావించిన పోలీసులు ఎమ్మెల్యే విజయుడిని అరెస్టు చేశారు. కాగా.. తనపై బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వాటిలో వాస్తవం లేదని నిరూపించుకునేందుకు నీటి విడుదల తన ఆధ్వర్యంలోనే చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆర్డీఎస్ కెనాల్ వద్ద సంపత్‌కుమార్ నిరసనకు దిగారు. చివరికి నాటకీయ పరిణామాల మధ్య ఉదయం విడుదల కావాల్సిన నీరు సాయంత్రం 4.15 గంటలకు అధికారులే విడుదల చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
ప్రజాప్రతినిధులకు రోజూ అవమానాలేనా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడి పట్ల ప్రభుత్వ అధికారులు వ్యవహరించిన తీరుపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా పాలనలో ప్రతినిధులకు ప్రతిరోజు అవమానాలేనా? ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ‘అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పైన గద్వాల జిల్లా యంత్రాంగం వ్యవహరించిన అనుచిత తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల చేతిలో తిరస్కరించబడిన కాంగ్రెస్ నాయకులను అధికారిక సమావేశాలు, కార్యక్రమాల్లో ఎందుకు ఆహ్వానిస్తున్నారో? రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమాధానం చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను అవమానించేందుకు ఈ ప్రభుత్వం ప్రోటోకాల్ విధానాలను ఏమైనా మార్చిందా? ’అని కేటీఆర్ నిలదీశారు.Praja Palana where our public representatives are humiliated every dayI condemn the atrocious conduct of District officials who have insulted our MLA, Alampur Vijayudu Garu@TelanganaCS What is the reason for insisting on inviting the Congress party leaders who’ve been… https://t.co/p490wZePDl— KTR (@KTRBRS) August 6, 2024తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి నీటి విడుదలపై వివాదం మంగళవారం వివాదం చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం రాజోలి మండలంలోని తుమ్మిళ్ల లిఫ్టు మోటార్లను స్థానిక ఎమ్మెల్యే విజయుడు ఆన్ చేసి నీళ్లు విడుదల చేశారు. మోటార్లు ఆన్‌చేసి మూడు గంటలైనా నీళ్లు రాకపోవడంతో ఎమ్మెల్యే ఆశ్చర్యపోయారు. తుమ్మిళ్ల నుంచి విజయుడు వెళ్లిన కొంత సమయానికి అక్కడికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే సంపత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి పంప్‌లను ఆఫ్ చేశారు. దీంతో ఆర్డీఎస్ కాలువకు నీరు నిలిచిపోయిందని ఎమ్మెల్యే విజయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన రైతులతో కలిసి తుమ్మిళ్లకు లిఫ్ట్ఇరిగేషన్ ప్రాజెక్టు వద్ద రోడ్డుపై భైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్తిత పరిస్థితి చోటుచేసుకుంది. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: అలంపూర్( జోగులాంబ గద్వాల) బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విజయుడి ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ బీఎస్పీ అభ్యర్థి ఆర్.ప్రసన్నకుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు. ప్రసన్న కుమార్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఉండవల్లి మండలం పుల్లూరు గ్రామ పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్ పదవికి విజయుడు రాజీనామా చేయకుండానే నామినేషన్ పత్రాలు దాఖలు చేశారని పేర్కొన్నారు. తన వృత్తికి సంబంధించిన వివరాలను నామినేషన్ పత్రాల్లో పేర్కొనలేదన్నారు. రాజీనామా లేఖను, దానికి లభించిన ఆమోదం తదితర ఆధారాలు సమర్పించలేదన్నారు. నిబంధనల ప్రకారం నామినేషన్‌కు మూడు నెలల ముందు రాజీనామా సమర్పించాల్సి ఉందన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి బీఫామ్ అందుకున్న విజయుడు(ఫైల్ ఫొటో) వాదనలు విన్న న్యాయమూర్తి ఎన్నికపై వివరణ ఇవ్వాలంటూ విజయుడికి నోటీసులు జారీ చేస్తూ విచారణను ఏప్రిల్ 18వ తేదీకి వాయిదా వేశారు. ఎన్నికలకు ముందు సైతం ప్రసన్నకుమార్ ఇదే అంశంపై పిటిషన్ దాఖలు చేసినా, ఎన్నికల నోటిఫికేషన్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించిన విషయం విదితమే. విజయుడు బీఆర్ఎస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి.. 2023 శాసనసభ ఎన్నికల్లో అలంపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్‌పై 30,573 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. -
బరిలోకి బీఆర్ఎస్ ఫుల్ టీమ్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఫుల్‌టీమ్ రంగంలోకి దిగింది. పార్టీ అభ్యర్థులంతా ఖరారవడంతోపాటు బీఫారాల పంపిణీ మంగళ వారం పూర్తయింది. పెండింగ్‌లో ఉన్న గోషామహ ల్ నుంచి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నంద కిషోర్ వ్యాస్ బిలాల్, నాంపల్లి నుంచి సీహెచ్ ఆనంద్కుమార్గౌడ్లకు టికెట్లు ఖరారయ్యాయి. ఇక అలంపూర్ (ఎస్సీ) అభ్యర్థిగా గతంలో ప్రకటించిన సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంను మారుస్తూ.. ఆయన స్థానంలో కొత్తగా కోడెదూడ విజయుడును ఎంపిక చేశారు. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలోని ఎనిమిది స్థానాల అభ్యర్థులకు, విజయుడుకు మంగళవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పార్టీ బీఫారాలను అందజేశారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన, బీఫారాల జారీ పూర్తయిందని నేతలు ప్రకటించారు. చల్లా అనుచరుడికి చాన్స్.. సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం తొలి జాబితాలోనే అలంపూర్ బీఆర్ఎస్ టికెట్ దక్కించుకున్నా.. స్థానిక నేతల్లో ఆయనపై వ్యతిరేకత వ్యక్తమైంది. దానికితోడు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డితో ఉన్న విభేదాలు కూడా ప్రభావం చూపాయి. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న తన అనుచరుడు ‘విజయుడు’కు టికెట్ కోసం ఒత్తిడి చేసిన ఎమ్మెల్సీ చల్లా చివరికి తన పంతం నెగ్గించుకున్నారు. ఎమ్మెల్సీ చల్లా మంగళవారం అలంపూర్ అభ్యర్థి విజయుడును వెంటబెట్టుకుని తొలుత ప్రగతిభవన్‌కు, తర్వాత తెలంగాణ భవన్‌కు వచ్చారు. తాజాగా బీఫారం అందుకున్న అభ్యర్థులు వీరే.. కేటీఆర్ చేతుల మీదుగా మంగళవారం బీ ఫారాలు అందుకున్న వారిలో సామ సుందర్‌రెడ్డి (యాకుత్‌పురా), అయిందాల కృష్ణయ్య (కార్వాన్), నందకిషోర్ వ్యాస్ బిలాల్ (గోషామహల్), ఇబ్రహీం లోడీ (చార్మినార్), ఎం.సీతారాంరెడ్డి (చాంద్రాయణ్‌గుట్ట), అలీ బఖ్రీ (బహదూర్‌పురా), తీగల అజిత్‌రెడ్డి (మలక్‌పేట), సీహెచ్ ఆనంద్‌గౌడ్ (నాంపల్లి), విజయుడు (అలంపూర్) ఉన్నారు. గోషామహల్ టికెట్ ఆశించిన ఆశిష్‌కుమార్ యాదవ్ మంగళవారం ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ను కలిశారు. భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామని, నందకిషోర్‌తో కలసి పనిచేయాలని ఆశిష్‌ను కేటీఆర్ బుజ్జగించారు. 119 స్థానాల్లోనూ అభ్యర్థుల ఖరారు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆగస్టు 21వ తేదీనే 115 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇస్తూనే.. ఏడుగురికి మాత్రం నిరాకరించారు. నాలుగు చోట్ల పూర్తిగా కొత్తవారికి అవకాశమిచ్చారు. అప్పట్లో జనగామ, నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి అభ్యర్థుల ప్రకటనను పెండింగ్‌లో పెట్టారు. తర్వాత మల్కాజిగిరి అభ్యర్థిగా ప్రకటించిన మైనంపల్లి హన్మంతరావు పార్టీని వీడటంతో.. ఆ స్థానంలో మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డికి అవకాశమిచ్చారు. జనగామ నుంచి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నర్సాపూర్ నుంచి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిలకు టికెట్ లభించింది. తాజాగా గోషామహల్, నాంపల్లికి కూడా అభ్యర్థులను ప్రకటించారు. అలంపూర్ అభ్యర్థిని మార్చారు. -
పశువుల పోషణలో ఖనిజ లవణాల పాత్ర కీలకం
కర్నూలు(అగ్రికల్చర్): పశువుల పెరుగుదలలో ఖనిజ లవణాలు కీలకమని పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ డాక్టర్ విజయుడు (8790997493) తెలిపారు. ఇవి జీవ రసాయన చర్యలకు మూలమైన జీవరసాల(హార్మోన్స్) పనితీరును ప్రభావితం చేసి తద్వారా శరీరం లో జరిగే జీవ చర్యలను నియంత్రిస్తాయన్నారు. వాటి సామర్థ్యం మేరకు ప్రతిభావంతంగా పనిచేయడానికి ఇవి అవసరమవుతాయన్నారు. ఖనిజ లవణ మిశ్రమాలు - వాటి ప్రాధాన్యతను ఆయన వివరించారు. పశువులు ఆరోగ్యం పెరగడానికి, పునరుత్పత్తికి, పాల ఉత్పత్తికి ఖనిజ లవణాలు ఎంతో తోడ్పడతాయి. ప్రధానంగా కాల్షియం, పాస్పరస్, సోడియం, పొటాషియం, కాపర్, కోబాల్ట్, మెగ్నీషియం, క్లోరిన్, ఐరన్ వంటి ఖనిజ లవణాలు అవసరం. ఖనిజ లవణాల లోపం ఏర్పడితే పశువు ఎదుగుదల, జీర్ణ ప్రక్రియ, పునరుత్పత్తి ప్రక్రియల్లో సమస్యలు ఏర్పడతాయి. ఖనిజ లవణాల మిశ్రమంతో లాభాలు ఇవి.. దూడలు ఆరోగ్యంగా పెరుగుతాయి, పశువులలో రోగ నిరోధక శక్తి పెంపొందుతుంది. పెయ్య పడ్డలు సకాలంలో తొలి ఎదను చూపుతాయి. పాడి పశువుల పునరుత్పత్తి చక్రం సక్రమంగా జరుగుతుంది. పాల దిగుబడి పెరుగుతుంది. చూడి పశువులలో మెయ్య దిగడం, (పొలాప్స్) వంటి సమస్యలు ఉండవు. పశువులలో ఈనిన తర్వాత వచ్చే మాయ పడకపోవడం, పాలజ్వరం లాంటి సమస్యలను నివారించుకోవచ్చు. పశువులు బట్టలు, మట్టి, కాగితాలు లాంటి అనవసర ఆహార పదార్థాలు తినడం, మూత్రం తాగడం వంటి దురలవాట్లకు లోను కావు. పశువుల చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది. ఇవ్వాల్సిన మోతాదు... దూడలకు 5 నుంచి 20 గ్రాములు, పెయ్య దూడలకు 20 నుంచి 30 గ్రాములు, పాడి పశువులకు 50 నుంచి 60 గ్రాములు రోజుకు ఒక పర్యాయం ఇవ్వాలి. ఖనిజ లవణాన్ని దాణాతో కలిపి పశువులకు అందించాలి. ఇవి పశువైద్య కేంద్రాల్లో లభిస్తాయి.