Congress Manik Rao Thackeray Comments On CM KCR Over Maharashtra Tour - Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర పర్యటన.. సీఎం కేసీఆర్‌కు మాణిక్‌రావు ఠాక్రే సవాల్‌

Published Mon, Jun 26 2023 3:07 PM | Last Updated on Mon, Jun 26 2023 3:40 PM

Congress Manik Rao Thackeray On CM KCR Maharashtra Tour - Sakshi

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ కాంగ్రెస్‌ ఇంచార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే సవాల్‌ విసిరారు. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని చెప్పారు. ఒక్కసీటు వచ్చిన తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని పేర్కొన్నారు. కాగా సీఎం కేసీఆర్‌ రెండు రోజులు మహారాష్ట్రలో పర్యటించనున్న విషయం తెలిసిందే. సోమవారం ప్రగతి భవన్‌ నుంచి రోడ్డు మార్గాన రెండు ప్రత్యేక బస్సులు, 600 కార్లతో కూడిన భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్రకు బయల్దేరారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌ మహారాష్ట్ర పర్యటనపై మాణిక్‌రావు స్పందించారు. కేసీఆర్ మహారాష్ట్ర టూర్‌తో ఒరిగేదేమీ లేదన్నారు. బీజేపీకి బీఆర్‌ఎస్‌ బీ టీమ్‌గా మారిందని ఆయన విమర్శించారు. భవిష్యత్తులో బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణలో దోచుకున్న సొమ్ము మహారాష్ట్రలో ఖర్చు పెడుతున్నారని దుయ్యబట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ను ఓడించేందుకు కేసీఆర్ డబ్బులు పంపారని ఆరోపించారు. తెలంగాణలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీనే అని తెలిపారు.
చదవండి: విపక్షాల ఐక్యతపై మంత్రి కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement