'విజయం మాదే, కాంగ్రెస్ ను మట్టికరిపిస్తాం'
థానే: మహారాష్ట్ర ఎన్నికల్లో మాకే మెజార్టీ లభిస్తుందని బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. థానేలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజా వ్యతిరేక పాలన అందించిన కాంగ్రెస్, ఎన్సీపీల కూటమితోనే తాము పోటీ పడుతామని జవదేకర్ అన్నారు.
శివసేనకు వ్యతిరేకంగా ఎలాంటి ప్రచారం, ప్రకటనలు ఇవ్వకూడదని బీజేపీ తీసుకుందని ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమిని చావుదెబ్బ తీస్తామని జవదేకర్ ధీమా వ్యక్తం చేశారు. మంచి పాలనను అందించేందుకు బీజేపీ అధికారంలోకి రానుందని ఆయన జోస్యం చెప్పారు.
మహారాష్ట్రలో త్వరలో జరుగనున్న ఎన్నికల్లో సీట్ల సర్ధుబాటులో ఏకాభిప్రాయం రాకపోవడంతో బీజేపీ, శివసేనలు తమ 25 ఏళ్ల బంధాన్ని తెగతెంపులు చేసుకున్నాయి.