ఏజ్ 91అయినా.. ఎన్నికల్లో దిగాడంటే..
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కురువృద్ధుడు బరిలోకి దిగాడు. 91 ఏళ్ల వయసులోనూ ఆయన మరోసారి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్నాడు. బెంగాల్ మొత్తం ఎన్నికల్లోనే పోటీ చేస్తున్న వ్యక్తుల్లో అతి పెద్ద వయసుకలిగిన వ్యక్తి ఈయనే. గ్యాన్ సింగ్ సోన్ పాల్ అనే వ్యక్తి ఇప్పటికే పదిసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.
ఇప్పుడు పోటీ చేయడం 11వసారి. అందరూ ఆయనను అక్కడ చాచాజీ అని అంటుంటారు. ఖరగ్ పూర్ సర్దార్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నారు. 1982 నుంచి కూడా ఆయన ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. సోహన్ పాల్ సొంత ప్రాంతం పంజాబ్ కాగా బెంగాల్కు 1900 ప్రాంతంలో వలస వచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరి స్వాతంత్ర్య ఉద్యమంలో పనిచేసిన ఆయన తొలిసారి 1969లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు.